Droupadi Murmu: శీతాకాల విడిది కోసం ఈ నెల 17న హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

President  on southern sojourn from Dec 17

  • డిసెంబరు 17న ఏపీలో కాన్వొకేషన్‌లో పాల్గొని... సాయంత్రం హైదరాబాద్‌కు రానున్న ముర్ము
  • 21న వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం సందర్శన
  • మహిళా కాలేజీ శతాబ్ది వేడుకలను ప్రారంభించనున్న ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17న తెలంగాణకు రానున్నారు. శీతాకాల విడిది కోసం ఆమె హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈ క్రమంలో 21న కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయాన్ని ఆమె సందర్శించనున్నారు. ఆమె ఈ మహిళా కాలేజీ శతాబ్ధి వేడుకలను ప్రారంభిస్తారు.

శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ఐదు రోజుల పాటు ఉండనున్నారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన పర్యటన షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది.

రాష్ట్రపతి ముర్ము 17వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుంటారు. మంగళగిరిలోని ఎయిమ్స్‌లో జరిగే మొదటి కాన్వొకేషన్‌లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌కు వస్తారు. ఈ నెల 20న సికింద్రాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్‌ను సందర్శిస్తారు. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో 'ఎట్‌ హోం' కార్యక్రమం నిర్వహిస్తారు. గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

21వ తేదీన ఉదయం 11 గంటలకు వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయానికి చేరుకుని శ‌తాబ్ది వేడుక‌ల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళతారు.

  • Loading...

More Telugu News