Mohan Babu: మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల

Actor Mohan Babu health Bulletin released

  • ఒళ్లు నొప్పులు, ఆందోళన కారణాలతో ఆసుపత్రిలో చేరారన్న వైద్యులు
  • ఎడమకంటి కింద గాయాలను గుర్తించినట్లు తెలిపిన వైద్యులు
  • హృదయ స్పందనలోనూ హెచ్చుతగ్గులు ఉన్నాయని వెల్లడి

సినీ నటుడు మంచు మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదలైంది. మోహన్ బాబు నిన్న గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో ఈరోజు హెల్త్ బులెటిన్‌ను వైద్యులు విడుదల చేశారు. మోహన్ బాబు ఎడమకంటి కింద గాయాలు గుర్తించినట్లు వైద్యులు తెలిపారు.

మోహన్ బాబు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని, హృదయ స్పందనలో హెచ్చుతగ్గులు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నట్లు వెల్లడించారు. ఆయన ఒళ్లు నొప్పులు, ఆందోళన వంటి కారణాలతో ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. రెండు రోజులు ఆసుపత్రిలో ఉండాలన్నారు.

మరోవైపు రాచకొండ సీపీ కార్యాలయానికి మంచు మనోజ్ వచ్చారు. మోహన్ బాబు లేఖ ద్వారా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు విచారణకు పిలిచారు. దీంతో ఈరోజు మధ్యాహ్నం విచారణకు హాజరయ్యారు. పోలీసులు ఆయనను విచారించారు.

  • Loading...

More Telugu News