Rishabh Pant: మ‌రోసారి 'బేబీ సిట్ట‌ర్'గా మారిన రిష‌భ్ పంత్‌.. వీడియో వైర‌ల్‌!

Rishabh Pant Turns Babysitter In Australia As Adorable Interaction With Young Fan Goes Viral

  • అడిలైడ్‌లో ఓ షాపింగ్ మాల్ వ‌ద్ద అభిమాని కూతురిని ఆడించిన పంత్‌
  • పాప‌ను ఎత్తుకుని పంత్ లాలించిన వీడియో నెట్టింట హ‌ల్‌చ‌ల్‌
  • 2018/19 బీజీటీ సిరీస్‌లోనూ అప్ప‌టి ఆసీస్‌ కెప్టెన్ టీమ్ పైన్ పిల్ల‌ల‌ను ఆడించిన పంత్ 
  • పంత్ మంచి 'బేబీ సిట్ట‌ర్' అంటూ పైన్ భార్య బోనీ కితాబు

టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ రిష‌భ్ పంత్ మ‌రోసారి బేబీ సిట్ట‌ర్‌గా మారాడు. అడిలైడ్‌లో ఓ షాపింగ్ మాల్ వ‌ద్ద చిన్నారిని ఎత్తుకుని ఆడించాడు. ఓ అభిమాని కూతురు అయిన ఆ పాప‌ను ఎత్తుకుని పంత్‌ లాలించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

కాగా, 2018/19 బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్‌లోనూ అప్ప‌టి ఆస్ట్రేలియా కెప్టెన్ టీమ్ పైన్ పిల్ల‌ల‌ను పంత్ ఆడించిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో పైన్ ఫ్యామిలీతో పంత్ ఫొటోలు దిగాడు. దాంతో పంత్ మంచి 'బేబీ సిట్ట‌ర్' అని పైన్ భార్య బోనీ కితాబు కూడా ఇచ్చారు. 

ఇక ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ బీజీటీలో భాగంగా భార‌త్, ఆసీస్ బ్రిస్బేన్ వేదిక‌గా మూడో టెస్టు ఆడ‌నున్నాయి. ఇప్ప‌టికే రెండు టెస్టుల్లో ఇరు జ‌ట్లు చెరో విజ‌యంతో సమంగా ఉన్నాయి. గ‌బ్బా స్టేడియంలో జ‌రిగే ఈ మ్యాచ్‌లో పంత్ మ‌రోసారి రాణిస్తే టీమిండియాకు తిరుగు ఉండ‌దు. 

ఈ మైదానంలో మ‌నోడికి మంచి రికార్డు ఉంది. 2021లో బీజీటీ సిరీస్‌లో భాగంగా పంత్ ఓ మ్యాచ్‌లో భార‌త్‌కు మ‌రుపురాని విజ‌యాన్ని అందించాడు. ఈ టెస్టులో అత‌డు 89 ప‌రుగులు చేయ‌డంతో భార‌త్ 328 ర‌న్స్ ఛేజ్ చేసి మ‌రీ గెలిచింది. త‌ద్వారా భార‌త జ‌ట్టు 2-1తో సిరీస్ కూడా గెలుచుకుంది. 

  • Loading...

More Telugu News