Dharmapuri Arvind: కేటీఆర్, కవితకు కుక్క కూడా ఓటు వేయదు: బీజేపీ ఎంపీ అర్వింద్ తీవ్రవ్యాఖ్యలు
- కేటీఆర్ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మాత్రమేనని వ్యాఖ్య
- తాను ఎప్పుడూ ఫైర్ బ్రాండ్‌నే అన్న అర్వింద్
- తెలంగాణ తల్లి విగ్రహం పేరుతో పిచ్చి రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... కేటీఆర్, కవితలకు వచ్చే ఎన్నికల్లో కుక్క కూడా ఓటు వేయదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మాత్రమేనని గుర్తుంచుకోవాలని సూచించారు.
తాను ఎప్పుడూ ఫైర్ బ్రాండ్‌నే అని మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నా బండి నా చేతిలోనే ఉందని... సమయాన్ని బట్టి తాను గేర్ మారుస్తానని, అప్పుడే స్పీడ్ మారుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహం పేరుతో పిచ్చి రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు.