RBI: ఆర్బీఐ గవర్నర్‌గా చివరిరోజు శక్తికాంతదాస్ ఏం చెప్పారంటే...?

Shaktikanta Das outlines most important tasks

  • ఈరోజు పదవీ విరమణ చేస్తున్న శక్తికాంతదాస్
  • ఆర్బీఐ ముందున్న అతిపెద్ద సవాల్ సైబర్ సెక్యూరిటీ అని వెల్లడి
  • కొత్త టెక్నాలజీపై దృష్టి సారించాలని సూచన

సైబర్ సెక్యూరిటీ అంశం సవాల్‌గా మారుతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. ఆర్బీఐ గవర్నర్‌గా తన చివరిరోజున విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొత్త ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్న సంజయ్ మల్హోత్రకు అభినందనలు తెలిపారు. ఆయనకు అపారమైన అనుభవం ఉందని, సీబీడీసీ, యూఎల్ఎక్స్ వంటి ఆర్బీఐ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించే సత్తా ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ, సైబర్ సెక్యూరిటీ ఆర్బీఐ ముందున్న అతిపెద్ద సవాల్ అన్నారు. సైబర్ హెచ్చరికలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కొత్త టెక్నాలజీని ఉపయోగించే అంశంపై దృష్టి సారించాలన్నారు. అలాగే, ద్రవ్యోల్భణం, వృద్ధి మధ్య సమతుల్యతలను పునరుద్ధరించడం అత్యంత ముఖమైన విషయమన్నారు. గత నాలుగేళ్లుగా కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, దీంతో గత అక్టోబర్‌లో ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ఠస్థాయి 6.21 శాతానికి పెరిగిందన్నారు.

మోదీకి కృతజ్ఞతలు

ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర బ్యాంకు బృందానికి ఆయన ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు పదవీ విరమణ చేయనున్నానని... ఇన్నాళ్లు తనకు మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు అని పేర్కొన్నారు. దేశానికి సేవ చేసే అవకాశం కల్పించిన మోదీకి ధన్యవాదాలు అని రాసుకొచ్చారు. ఆర్థికమంత్రిత్వ శాఖ, ఆర్బీఐ మధ్య గత ఆరేళ్లుగా సమన్వయం బాగుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News