Manchu Manoj: దాని కోసమే నా పోరాటం: మంచు మ‌నోజ్

Manchu Manoj Latest Comments on His

  • తాను ఆస్తులు, డ‌బ్బు కోసం పోరాటం చేయ‌డం లేద‌న్న మంచు మ‌నోజ్‌
  • కేవ‌లం ఆత్మ‌గౌర‌వం కోస‌మే పోరాడుతున్నాన‌ని వ్యాఖ్య‌
  • త‌న భార్యాపిల్లలకు రక్షణ లేకుండా పోయింద‌ని ఆవేద‌న‌

త‌న‌ ఫ్యామిలీ వివాదంపై మంచు మనోజ్ మ‌రోసారి స్పందించారు. తాను ఆస్తులు, డ‌బ్బు కోసం పోరాటం చేయ‌డం లేద‌ని అన్నారు. తాను కేవ‌లం ఆత్మ‌గౌర‌వం కోస‌మే పోరాడుతున్నాన‌ని తాజాగా మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. తన ఇంటి దగ్గర హైడ్రామా నేపథ్యంలో ఆయ‌న మాట్లాడుతూ.. "నాకు న్యాయం జ‌ర‌గ‌డం లేదు. పోలీసులు ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పోలీసులను ర‌క్ష‌ణ‌ అడిగితే నా అనుచరులను బెదిరిస్తున్నారు. 

నాకు న్యాయం జ‌రిగేవ‌ర‌కూ అంద‌రినీ క‌లుస్తా. నా బిడ్డలు ఇంట్లో ఉండగా దాడి చేయడం సరికాదు. నా భార్యాపిల్లలకు రక్షణ క‌ర‌వైంది. నా భార్యాపిల్లల రక్షణ కోసం బౌన్సర్లను తెచ్చుకున్నా. మా బౌన్సర్లను ఎందుకు బయటకు పంపారు. నేను డబ్బు, ఆస్తి కోసం పోరాటం చేయడం లేదు. నా ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నాను" అని మంచు మ‌నోజ్ చెప్పుకొచ్చారు.

Manchu Manoj
Family Disputes
Manchu Vishnu
Mohan Babu
Tollywood
  • Loading...

More Telugu News