MS Dhoni: ధోనీ క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదుగా.. ఎండార్స్‌మెంట్స్‌లో అమితాబ్‌, షారూఖ్‌ల‌ను వెన‌క్కి నెట్టిన మాజీ సార‌థి!

MS Dhoni Surpasses Amitabh Bachchan And SRK To Top List Of Endorsements With Record Numbers

  • నాలుగేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ గుడ్‌బై
  • 2024 ప్రథమార్ధంలో ధోనీ ఖాతాలో మొత్తం 42 బ్రాండ్ డీల్స్
  • అమితాబ్ కంటే ఒకటి ఎక్కువ, షారూఖ్ కంటే 8 డీల్స్ అధికం

నాలుగేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైనప్పటికీ టీమిండియా మాజీ కెప్టెన్‌ మ‌హేంద్ర సింగ్‌ ధోనీ క్రేజ్ ఇప్ప‌టికీ ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఈ మాజీ సార‌థి ఎక్క‌డికి వెళ్లినా అభిమానులు ఆయ‌న కోసం ఎగ‌బ‌డుతుంటారు. ఇక కెప్టెన్ కూల్ బ్యాట్ ప‌ట్టి మైదానంలో అడుగుపెడితే స్టేడియం హోరెత్తిపోవాల్సిందే. ప్ర‌స్తుతం ఎంఎస్‌డీ కేవ‌లం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో మాత్రమే ఆడుతున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ. 4 కోట్లకు రిటైన్ చేసుకుంది. దీంతో వ‌చ్చే సీజ‌న్‌లో మ‌రోసారి ఈ స్టార్ ప్లేయ‌ర్ ఐపీఎల్‌లో అభిమానుల‌ను అల‌రించ‌నున్నాడు.

ఇక ఎంఎస్ ధోనీ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌కు వీడ్కొలు పలికినా.. అత‌ని మార్కెట్ విలువపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపలేదు. ఇంకా చెప్పాలంటే 2024 ప్రథమార్థంలో ధోనీ విలువ పెరిగింది. ఈ ఏడాది ప్రథమార్ధంలో బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌ల పరంగా బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్ వంటి బాలీవుడ్ దిగ్గజాలను కూడా అధిగమించిన‌ట్లు టీఏఎం మీడియా రీసెర్చ్ నివేదిక పేర్కొంది. 
 
టీఏఎం మీడియా రీసెర్చ్ నివేదిక ప్రకారం 2024 ప్రథమార్ధంలో ధోనీ ఖాతాలో మొత్తం 42 బ్రాండ్ డీల్స్ చేరాయి. అమితాబ్ కంటే ఒకటి ఎక్కువ, షారూఖ్ కంటే 8 డీల్స్ అధికం. ఇక ఇటీవలే ప్ర‌ముఖ‌ యూరోగ్రిప్ టైర్స్‌కు కూడా ధోనీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మారారు. ఇప్ప‌టికే అత‌ని చేతిలో గల్ఫ్ ఆయిల్, క్లియర్‌ట్రిప్, మాస్టర్ కార్డ్, సిట్రోయెన్, లేస్, గరుడ ఏరోస్పేస్ వంటి ఇతర పెద్ద బ్రాండ్‌ల ఎండార్స్‌మెంట్స్‌లను కలిగి ఉన్నాడు.

  • Loading...

More Telugu News