Pushpa 2: షారుఖ్ ఖాన్ కలెక్షన్ల రికార్డులను తుడిచేసిన పుష్ప-2

Pushpa 2 has surpassed the lifetime box office collections of Shah Rukh Khan film Jawan

  • ‘జవాన్’ లైఫ్‌టైమ్ కలెక్షన్లు దాటేసిన పుష్ప-2
  • కేవలం 5 రోజుల్లోనే రూ.593 కోట్ల వసూలు
  • హిందీలో వేగంగా రూ.300 కోట్లు సాధించిన చిత్రంగానూ రికార్డ్

అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప-2’ కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. విడుదలైన అన్ని భాషల్లోనూ భారీ వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా హిందీ వెర్షన్‌లో బాక్సాఫీస్‌ను కొల్లగొడుతూ అప్రతిహతంగా దూసుకుపోతోంది. డిసెంబర్ 5న విడుదలైనప్పటి నుంచి రికార్డు స్థాయి కలెక్షన్లు రాబడుతున్న ఈ సినిమా తాజాగా ‘బాలీవుడ్ బాద్ షా’ షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ మూవీ జీవితకాల కలెక్షన్లను అధిగమించింది. జవాన్ సినిమా మొత్తం రూ.582.31 కోట్లు వసూలు చేయగా.. పుష్ప-2 చిత్రం విడుదలైన 5 రోజుల్లోనే రూ.593.1 కోట్లు రాబట్టిందని ‘శాక్‌నిల్క్’ కథనం పేర్కొంది. 

హిందీ వెర్షన్‌లో అత్యంత వేగంగా రూ.300 కోట్ల వసూళ్లు రాబట్టిన భారతీయ సినిమాగా ‘పుష్ప-2’ నిలిచింది. కేవలం మొదటి 5 రోజుల్లోనే ఈ రికార్డు సాధించి ఆశ్చర్యపరిచింది. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్, పఠాన్ సినిమాలు రూ.300 కోట్ల క్లబ్‌లో చేరడానికి 6 రోజులకు పైగా సమయం పట్టింది. కాగా సోమవారం ఈ సినిమా కలెక్షన్లు గణనీయంగా తగ్గాయని పేర్కొంది. కాగా 2021లో విడుదలైన ‘పుష్ప: ది రైజ్‌’కి సీక్వెల్‌గా ‘పుష్ప -2’ విడుదలైంది. ప్రధాన తారాగణంతో పాటు సునీల్, అనసూయ భరద్వాజ్, జగపతి బాబుతో పాటు పలువురు నటులు కీలక పాత్రలు పోషించారు. 

  • Loading...

More Telugu News