Jobs: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. అర్హతలు ఇవే!

Supreme Court Job Notification

  • మొత్తం 107 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
  • దేశవ్యాప్తంగా 23 నగరాల్లో రాత పరీక్ష
  • డిగ్రీ, లా డిగ్రీ, టైపింగ్ తప్పనిసరి

సుప్రీంకోర్టులో పలు ఖాళీల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. కోర్ మాస్టర్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన రిలీజ్ చేసింది. మూడు విభాగాల్లో మొత్తం 107 పోస్టులను భర్తీ చేయనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఈ నెల 4 నుంచి దరఖాస్తు పక్రియ మొదలు కాగా 25వ తేదీతో గడువు ముగుస్తుందని తెలిపింది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.sci.gov.in/ ద్వారా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా 23 నగరాల్లో రాత పరీక్ష నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఖాళీలు:
కోర్ మాస్టర్ - 31
సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ - 33
పర్సనల్ అసిస్టెంట్ - 43

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ, డిగ్రీతో పాటు టైపింగ్ స్పీడ్ 40 వర్డ్స్ పర్ మినిట్

వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక: రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్, కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం, ఫీజు: సుప్రీంకోర్టు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.250 ఫీజు చెల్లించాలి

జీతం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.44,000 నుంచి రూ. 67,000 వరకు జీతం చెల్లిస్తారు

Jobs
Job Notifications
Supreme Court
Govt jobs
  • Loading...

More Telugu News