Oldest Marriage: 102 ఏళ్ల మహిళను పెళ్లాడిన 100 ఏళ్ల పెళ్లికొడుకు.. ప్రపంచంలోనే మొదటిసారి!

Meet the World oldest newlywed couple

  • అమెరికాలో ఆశ్చర్యకర ఘటన
  • ప్రపంచంలో ఇప్పటి వరకు ఇదే అత్యంత వృద్ధ వివాహం
  • ఇద్దరి మొత్తం వయసు 202 సంవత్సరాల 271 రోజులు
  • వీరి వివాహాన్ని గుర్తించి రికార్డు అందజేసిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్

ప్రేమకు వయసుతో సంబంధం లేదంటారు. దీనిని నిరూపించే ఘటనలు కోకొల్లలు. తాజాగా దీనిని బలంగా నిరూపించే మరో ఘటన అమెరికాలో జరిగింది. 102 ఏళ్ల బామ్మ.. 100 ఏళ్ల వృద్ధుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇదే అత్యంత వృద్ధ పెళ్లి. 

102 ఏళ్ల శతాధిక వృద్ధురాలు మార్జోరీ ఫిటర్‌మన్, 100 ఏళ్ల బెర్నీ లిట్‌మన్ ఇద్దరూ మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆపై పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. వీరి మొత్తం వయసు 202 సంవత్సరాల 271 రోజులు. ఈ పెళ్లితో గత రికార్డు బద్దలై కొత్తగా వీరి పేరున ప్రపంచ రికార్డు నమోదైంది. 

   ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. వీరిద్దరూ పదేళ్లకుపైగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. వివాహం చేసుకుని తమ బంధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాలని భావించిన ఈ జంట ఈ ఏడాది మేలో వివాహ బంధంతో ఒక్కటైంది. తాజాగా ఈ నెల 3న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వీరి వివాహాన్ని గుర్తించి రికార్డు అందజేసింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ శతాధిక వృద్ధ జంట వివాహానికి ఇరు కుటుంబాల వారు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News