Manchu Manoj: మంచు ఫ్యామిలీలో విభేదాలంటూ ప్రచారం.. ఖండించిన మంచు మోహన్ బాబు ఫ్యామిలీ

Manchu Family Fighting

  • మనోజ్ పై దాడి జరిగిందనే వార్తల్లో నిజంలేదని వివరణ
  • పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారంటూ మీడియాలో ప్రసారం
  • అసత్య ప్రచారాలు చేయొద్దని మంచు మోహన్ బాబు ఫ్యామిలీ సూచన

మంచు ఫ్యామిలీలో విభేదాలు తలెత్తాయని, మనోజ్ పై దాడి జరిగిందని సాగుతున్న ప్రచారాన్ని మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ఖండించింది. ఈ వార్తల్లో నిజంలేదని స్పష్టం చేసింది. పోలీస్ స్టేషన్ లో మోహన్ బాబు, మనోజ్ పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారంటూ జరుగుతున్న ప్రచారం ఆపాలని కోరింది. ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా వార్తలు ప్రసారం చేయొద్దంటూ మీడియాకు హితవు పలికింది.

ఆదివారం ఉదయం మంచు ఫ్యామిలీలో గొడవ జరిగిందని కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేశాయి. మంచు మనోజ్ గాయాలతో పోలీస్ స్టేషన్ కు వచ్చి తండ్రి మోహన్ బాబుపై ఫిర్యాదు చేశారని ప్రసారం చేశాయి. తనతో పాటు తన భార్యపైనా తండ్రి దాడి చేశాడని మనోజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపాయి. అయితే, కొడుకే తనపై దాడి చేశాడంటూ మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ సంచలన కథనాలు ప్రసారం చేశాయి. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి తండ్రీకొడుకులు గొడవ పడ్డారని ప్రచారం చేశాయి. ఈ వార్తలను మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ఖండించింది. నిరాధార కథనాలను ప్రసారం చేయొద్దంటూ మీడియాకు విజ్ఞప్తి చేసింది.

Manchu Manoj
Mohan Babu
Manchu Family
  • Loading...

More Telugu News