Iltija Mufti: హిందుత్వ అనేది ఓ జబ్బు.. షాకింగ్ వీడియోను షేర్ చేస్తూ మాజీ సీఎం కుమార్తె వివాదాస్పద వ్యాఖ్యలు

Hindutva a Disease Iltija Mufti Shocking Remark

  • ‘జై శ్రీరామ్’ అనాలంటూ ముగ్గురు ముస్లిం బాలురపై చెప్పుతో దాడి
  • వారు ఏడుస్తూ భయంతో ‘జై శ్రీరామ్’ అంటున్నా చెంపలు వాయించిన కుర్రాడు
  • ఈ వీడియోను షేర్ చేసిన జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తీజా
  • ఈ వీడియోను చూసి రాముడు సిగ్గుతో తలదించుకోవాలని వ్యాఖ్య

జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తీజా ముఫ్తీ హిందూమతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘హిందుత్వ అనేది ఒక జబ్బు’ అంటూ ఎక్స్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో ఓ కుర్రాడు.. ‘జై శ్రీరామ్’ అని చెప్పాలంటూ ముగ్గురు ముస్లిం బాలురను చెప్పుతో దారుణంగా కొడుతున్నాడు. ‘అల్లా’ అంటావా అంటూ చెప్పుతో చెంపలు వాయించాడు. వారు ఏడుస్తున్నా వదలకుండా చెప్పుతో వారిని ఎడాపెడా వాయిస్తూనే ఉన్నాడు. వారు భయంతో ‘జైశ్రీరామ్’ అని అంటున్నా వదలకుండా కొడుతూనే ఉన్నాడు. 

ఈ వీడియోను షేర్ చేసిన ఇల్తీజా.. తన పేరు జపించేందుకు నిరాకరించిన ముస్లిం బాలురను చెప్పుతో కొడుతుండడాన్ని చూసి రాముడు సిగ్గుతో తలవంచుకుని నిస్సహాయంగా చూడాలని రాసుకొచ్చారు. హిందుత్వ అనేది ఒక జబ్బులాంటిదని, దేవుడి పేరుతో కోట్లమంది భారతీయులపై ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

కాగా, గతంలో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. సనాతన ధర్మం డెంగీ, మలేరియా లాంటిదని, దానిని నిర్మూలించాలని చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. 

  • Loading...

More Telugu News