WTC points table: భారత్ ఘోర ఓటమితో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఊహించని మార్పులు

India droped third place in WTC points table as defeat in Adelaide test against Australia

  • డబ్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోల్పోయిన భారత్
  • 57.29 పాయింట్లతో మూడవ స్థానానికి దిగజారిన టీమిండియా
  • ఆస్ట్రేలియాపై మిగతా 3 టెస్టుల్లో గెలిస్తేనే డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘోరంగా ఓడిపోయింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓటమి పరాభవం ఎదురైంది. ఈ పరాజయం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) పాయింట్స్ టేబుల్‌పై గట్టి ప్రభావాన్ని చూపించింది. వరుసగా రెండు సార్లు ఫైనలిస్ట్ అయిన టీమిండియా నంబర్ 1 స్థానాన్ని కోల్పోయింది. అగ్రస్థానం నుంచి మూడవ స్థానానికి దిగజారింది.  

ఈ ఓటమి తర్వాత భారత ‘పాయింట్స్ పర్సెంటేజ్ సిస్టమ్’ (పీసీటీ) పాయింట్లు 57.29కి తగ్గాయి. ఇదే సమయంలో ఆస్ట్రేలియా పీసీటీ 60.71కి పెరిగి నంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లింది. ఇక 59.26 పీసీటీతో దక్షిణాఫ్రికా రెండవ స్థానంలో నిలిచింది. భారత్ మూడవ ర్యాంకులో ఉండగా, శ్రీలంక (50 పీసీటీ) నాలుగవ స్థానంలో ఉంది. దీంతో భారత్ వచ్చే ఏడాది జూన్‌ నెలలో ఇంగ్లండ్‌లో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ అర్హత సాధించే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. 

ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో భారత్‌కు మరో మూడు టెస్ట్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ మూడింటిలోనూ గెలిస్తే భారత్‌కు ఫైనల్ ఆడే అవకాశాలు ఉంటాయి. 64.03 పాయింట్లతో ఫైనల్ చేరుకుంటుంది. లేదంటే అవకాశాలు దాదాపు లేవనే భావించాలి. దక్షిణాఫ్రికా విజయాలను బట్టి సమీకరణాలు మారతాయి. స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలో 0-3 తేడాతో  సిరీస్‌ను కోల్పోవడం భారత్‌కు బాగా ప్రతికూలమైంది. ఇక శ్రీలంక రూపంలో కూడా పోటీ ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు.

ఆస్ట్రేలియా చేతిలో 5 టెస్ట్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. భారత్‌తో మూడు, శ్రీలంకపై రెండు మ్యాచ్‌లు ఆడనుంది. వీటిలో మూడు విజయాలు సాధిస్తే ఆసీస్ నేరుగా ఫైనల్‌కు చేరుటుంది. ఇక దక్షిణాఫ్రికా ఆడబోయే అన్ని టెస్టుల్లో గెలిస్తే ఆ జట్టు పాయింట్లు 69కి చేరుతాయి. కాబట్టి ఆస్ట్రేలియాపై విజయాలు సాధిస్తే భారత్‌ ఫైనల్‌కు చేరుకునే అవకాశాలు మెరుగుగా ఉంటాయి.

  • Loading...

More Telugu News