KCR: ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar meets KCR in Erravalli farm house

  • తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్‌ను ఆహ్వానించిన పొన్నం
  • ఫాంహౌస్‌కు వచ్చిన మంత్రిని సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్
  • ఎల్లుండి సచివాలయ ప్రాంగణంలో విగ్రహావిష్కరణ

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కలిశారు. ఎల్లుండి సచివాలయం ప్రాంగణంలో జరగనున్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించారు. తన ఫాంహౌస్‌కు వచ్చిన మంత్రిని కేసీఆర్ మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకి కూడా మంత్రి ఆహ్వానం అందించనున్నారు.

సచివాలయంలో ఈ నెల 9న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనుంది. ఈ విగ్రహావిష్కరణకు మాజీ సీఎం కేసీఆర్ ను, కేంద్రమంత్రులను ఆహ్వానిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇదివరకే చెప్పారు. 

  • Loading...

More Telugu News