Telangana: తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో భూప్రకంపనలు
- కౌకుంట్ల మండలం దాసరపల్లె కేంద్రంగా ప్రకంపనలు
- రిక్టర్ స్కేల్‌పై తీవ్రతను 3గా గుర్తించిన అధికారులు
- ఇటీవలే ములుగు జిల్లా కేంద్రంగా ప్రకంపనలు
తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై వీటి తీవ్రత 3గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కౌకుంట్ల మండలం దాసరపల్లె కేంద్రంగా మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రకంపనలు వచ్చాయి. భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
ఇటీవల ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించిన విషయం తెలిసిందే. జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగు తీశారు. అప్పుడు ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.03గా నమోదైంది. భూకంప కేంద్రం నుంచి 225 కిలోమీటర్ల పరిధిలో ప్రకంపనల ప్రభావం కనిపించింది.