KCR: తెలంగాణ‌లో ఆస‌క్తిక‌ర ప‌రిణామం.. కేసీఆర్ ఎర్ర‌వ‌ల్లి ఫామ్‌హౌస్‌కు మంత్రి పొన్నం!

Minister Ponnam Prabhakar will soon Meet KCR at Erravalli Farmhouse

  • తెలంగాణ‌ త‌ల్లి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్న ప్ర‌భుత్వం
  • మ‌రికాసేపట్లో ఎర్ర‌వ‌ల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్ల‌నున్న మంత్రి పొన్నం
  • ఈ నెల 9న రాష్ట్ర స‌చివాల‌యంలో తెలంగాణ‌ త‌ల్లి కొత్త‌ విగ్రహం ఆవిష్క‌ర‌ణ‌

తెలంగాణ‌లో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకోనుంది. మాజీ సీఎం, బీఎస్ఆర్ అధినేత కేసీఆర్‌ను తెలంగాణ ప్ర‌భుత్వం త‌మ అధికారిక కార్య‌క్ర‌మానికి ఆహ్వానించేందుకు ఆయ‌న ఎర్ర‌వ‌ల్లిలోని ఫామ్‌హౌస్‌కు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ను పంపిస్తోంది. 

రేవంత్ రెడ్డి స‌ర్కార్ ఈ నెల 9న రాష్ట్ర స‌చివాల‌యంలో తెలంగాణ‌ త‌ల్లి కొత్త‌ విగ్రహాన్ని ఆవిష్క‌రించ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖుల‌తో పాటు మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను కూడా ఆహ్వానించాల‌ని నిర్ణ‌యించింది. 

దీనికోసం ఆయ‌న వ‌ద్ద‌కు మంత్రి పొన్నంను పంపుతోంది. మ‌రికాసేపట్లో ఆయ‌న ఎర్ర‌వ‌ల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్ల‌నున్నారు. బీఎస్ఆర్ అధినేతను తెలంగాణ త‌ల్లి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు రావాల్సిందిగా స్వ‌యంగా ఆహ్వానించ‌నున్నారు.    

  • Loading...

More Telugu News