Adelaide Stadium: అడిలైడ్ స్టేడియంలో పవర్ కట్... ఒకసారి కాదు రెండుసార్లు!

Power off twice in Adelaide stadium during Aussies batting

  • భారత్-ఆసీస్ మధ్య రెండో టెస్టు
  • అడిలైడ్ లో డే/నైట్ టెస్టు
  • ఆసీస్ బ్యాటింగ్ చేస్తుండగా పవర్ కట్
  • ఆరిపోయిన ఫ్లడ్ లైట్లు
  • నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్ చేస్తుండగా ఘటన

టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నేడు అడిలైడ్ లో డే/నైట్ టెస్టు ప్రారంభమైంది. అయితే, తొలి రోజు ఆట సందర్భంగా స్టేడియంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఫ్లడ్ లైట్ల వెలుగులో మ్యాచ్ జరుతుండగా... ఉన్నట్టుండి లైట్లు ఆరిపోయాయి. దాంతో ఆటకు అంతరాయం కలిగింది.

ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ చేస్తుండగా.... రెండు సార్లు మైదానంలో ఇలా పవర్ కట్స్ చోటుచేసుకున్నాయి. 18వ ఓవర్లో టీమిండియా యంగ్ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్ చేస్తుండగా... ఫ్లడ్ లైట్లు ఆగిపోయాయి. దాంతో నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్ రనప్ మధ్యలోనే ఆపేశాడు. 

అదే ఓవర్లో మరోసారి మైదానంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చివరికి ఎలాగోలా ఆ ఓవర్ పూర్తయింది. ఆ ఓవర్ లో ఆసీస్ ఓపెనర్ నాథ్ మెక్ స్వీనీ బ్యాటింగ్ చేయగా, నితీశ్ కుమార్ రెడ్డి మెయిడెన్ చేయడం విశేషం.

  • Loading...

More Telugu News