Supreme Court: తెలంగాణ ప్రభుత్వానికి ఊరట... గ్రూప్-1 పరీక్షల రద్దు కుదరదన్న సుప్రీంకోర్టు

SC green signal to group 1 exams

  • గ్రూప్-1 రద్దు, మెయిన్స్‌ను వాయిదా వేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్
  • పిటిషనర్లు క్వాలిఫై కానందున మెయిన్స్ వాయిదా అవసరం లేదన్న కోర్టు
  • పరీక్షల నిర్వహణలో కోర్టుల జోక్యం అనవసరమన్న ధర్మాసనం

గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు కుదరదని భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు, మెయిన్స్‌ను వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. విచారణ జరిపిన న్యాయస్థానం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించినట్లయింది.

ప్రభుత్వం విడుదల చేసిన కొత్త నోటిఫికేషన్ చట్ట విరుద్ధమని కొంతమంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రిలిమ్స్‌లో 14 తప్పులున్నాయని పేర్కొన్నారు. గ్రూప్-1 మెయిన్స్‌ను వాయిదా వేయాలని కోరారు. అభ్యర్థుల పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

హైకోర్టు తీర్పును అభ్యర్థులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. పిటిషనర్లు మెయిన్స్‌కు క్వాలిఫై కానందున మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాల్సిన అవసరం లేదని తెలిపింది. పరీక్షల నిర్వహణలో కోర్టుల జోక్యం అనవసరమని ధర్మాసనం పేర్కొంది. కోర్టుల నిర్ణయంతో నియామకాల్లో జాప్యం జరుగుతుందని తెలిపింది. మెయిన్స్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వానికి పచ్చజెండా ఊపింది.

Supreme Court
Telangana
Group 1
  • Loading...

More Telugu News