Hyderabad: రానున్న మూడు రోజులు తెలంగాణలో తేలికపాటి వర్షాలు

Rains in Telangana for three days

  • ఎలాంటి హెచ్చరికలు జారీ చేయని వాతావరణ శాఖ
  • కొన్ని జిల్లాల్లో రేపు ఉదయం పొగమంచు ఏర్పడవచ్చని వెల్లడి
  • వచ్చే వారం రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో మార్పు ఉండదన్న వాతావరణ శాఖ

తెలంగాణలో రానున్న మూడు రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.

రేపు రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఆ తర్వాత రెండు రోజులు కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా రేపు ఉదయం పొగమంచు ఏర్పడే అవకాశముందని వెల్లడించింది.

వచ్చే వారం రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని వెల్లడించింది.

Hyderabad
Rains
Telangana
IMD
  • Loading...

More Telugu News