Ponnam Prabhakar: కేసీఆర్, కిషన్ రెడ్డి అపాయింట్ మెంట్ ఇస్తే వెళ్లి ఆహ్వానిస్తాం: పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar says will invite KCR and Bandi Sanjay

  • తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు విపక్ష నేతలను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడి
  • సచివాలయంలో ఈ నెల 9న విగ్రహావిష్కరణ ఉంటుందన్న మంత్రి
  • ఈ విగ్రహావిష్కరణకు విపక్ష నేతలు రావాలని విజ్ఞప్తి

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లను ఆహ్వానిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందుకోసం వారిని సమయం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. వారు అపాయింట్ మెంట్ ఇస్తే ప్రభుత్వం తరఫున ఆహ్వానిస్తామన్నారు.

సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు విపక్ష నేతలను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లను ఆహ్వానిస్తామని సీఎం రేవంత్ రెడ్డి నిన్ననే చెప్పారని గుర్తు చేశారు. వారు ఈ నెల 9న జరగనున్న ఈ కార్యక్రమానికి రావాలని విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News