Adilide Test: అడిలైడ్ టెస్ట్.. భారత టాపార్డర్ విఫలం.. స్వల్ప స్కోరుకే 5 వికెట్లు

Team top order fails in Adilide test and losses 5 Wickets for 90 runs score

  • 90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన భారత్
  • జైస్వాల్ 0, రోహిత్ 3, విరాట్ 7 పరుగులకే ఔట్
  • చెలరేగిన ఆస్ట్రేలియా పేసర్లు

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా మొదలైన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ నిరాశ పరిచింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 37, శుభ్‌మాన్ గిల్ 31 పరుగులతో కాస్త ఫర్వాలేదనిపించినా.. యశస్వి జైస్వాల్ 0, రోహిత్ శర్మ 3, విరాట్ కోహ్లీ 7 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యారు. దీంతో భారత్ కేవలం 90 పరుగుల స్వల్ప స్కోరుకే ముఖ్యమైన 5 వికెట్లను చేజార్చుకుంది. ఆసీస్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ 3 వికెట్లు, స్కాట్ బోలాండ్ 2 వికెట్లు తీశారు. ఆట 30 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోరు 100/5గా ఉంది. స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ (15) తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి (4) క్రీజులో ఉన్నారు. 

కాగా ఓపెనర్‌గా బ్యాటింగ్ చేసే కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. అయితే కేవలం 3 పరుగులు చేసి పెవిలియన్ చేరి నిరాశపరిచాడు. ఆసీస్ కొత్త పేసర్ బోలాండ్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఒక ఫోర్ కొట్టి మంచి టచ్‌లోకి వచ్చినట్టు కనిపించినప్పటికీ.. స్టీవెన్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 

  • Loading...

More Telugu News