Bangladesh: భారత సరిహద్దులో టర్కిష్ డ్రోన్లను మోహరించిన బంగ్లాదేశ్.. ఇండియా హై అలెర్ట్

Bangladesh deploys Turkish drones near India border

  • బైరాక్టర్ టీబీ2 యూఏవీలను మోహరించిన బంగ్లాదేశ్
  • ఉగ్రవాదులు, స్మగ్లర్లపై నిఘాను పెంచేందుకేనని సమాచారం
  • హసీనా బహిష్కరణ తర్వాత భారత సరిహద్దు సమీపంలో మళ్లీ యాక్టివ్ అవుతున్న ఉగ్రవాద గ్రూపులు
  • యూఏవీల మోహరింపును నిర్ధారించిన భారత ఆర్మీ వర్గాలు

పశ్చిమ బెంగాల్ సమీపంలోని సరిహద్దుల్లో టర్కీ తయారీ డ్రోన్లను బంగ్లాదేశ్ మోహరించిందన్న సమాచారంతో భారత్ అప్రమత్తమైంది. సరిహద్దుల వద్ద నిఘాను పెంచింది. షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత సరిహద్దు ప్రాంతాల్లో తీవ్రవాద కార్యకలాపాలు పెరిగినట్టు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.  

భారత సరిహద్దు సమీపంలో టర్కీ తయారీ ‘బైరాక్టర్ టీబీ2 మానవరహిత వైమానిక వాహనాల(యూఏవీలు)ను  మోహరించినట్టు వచ్చిన నివేదికలను ఆర్మీ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. నిఘా కార్యకలాపాల కోసం బంగ్లాదేశ్‌లోని 67వ ఆర్మీ వీటిని నిర్వహిస్తున్నట్టు తెలిసింది. బంగ్లాదేశ్ రక్షణ అవసరాల కోసం వీటిని మోహరించినప్పటికీ, అధునాతన డ్రోన్లను సున్నిత ప్రాంతాల్లో ఉంచడంతో భారత్ అప్రమత్తమైంది.

ఉగ్రవాద గ్రూపులపై హసీనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఆమె భారత్‌కు పారిపోయిన తర్వాత సరిహద్దుకు దగ్గర ఉన్న ప్రాంతాల్లోని తీవ్రవాదులు మళ్లీ పుంజుకుంటున్నారు. దేశంలోని ప్రస్తుత అస్థిర పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న ఉగ్రవాద గ్రూపులు, స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లు భారత్‌లోకి చొరబడుతున్నట్టు సమాచారం. హసీనా బహిష్కరణ తర్వాత సరిహద్దు ప్రాంతాల్లో భారత వ్యతిరేక అంశాలు పెరిగాయని, ఈ నేపథ్యంలో భారత సరిహద్దుల వద్ద అధునాతన యూఏవీ మోహరింపుతో నిఘా అవసరమని సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు తెలిపారు.  

Bangladesh
India
Bayraktar TB2 Drones
Indian Army
  • Loading...

More Telugu News