Harassment: లైంగికంగా నాకు సహకరిస్తే.. చదువులో నీకు సహకరిస్తా.. కాలేజీ విద్యార్థినికి టీచర్ మెసేజ్‌లు

PET Suspended After Sex Harassment Charge By Student

  • కోల్‌కతాలోని స్కాటిష్ చర్చ్ కాలేజీలో ఘటన
  • విద్యార్థులను వేధింపులకు గురిచేసిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్
  • ఓ విద్యార్థినితో వాట్సాప్ చాటింగ్
  • గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోని యాజమాన్యం
  • విద్యార్థులు ఆందోళనకు దిగడంతో దిగొచ్చి సస్పెండ్ చేసిన వైనం

మెసేజ్‌లు పంపిస్తూ తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడన్న విద్యార్థిని ఆరోపణలతో కోల్‌కతాలోని స్కాటిష్ చర్చ్ కాలేజీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌ను సస్పెండ్ చేశారు. టీచర్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు క్యాంపస్‌లో నిన్న ఆందోళనకు దిగారు. విద్యార్థినిలను ఇలా వేధింపులకు గురిచేయడం ఆయనకు ఇదే మొదటిసారి కాదని, గతంలో తమనూ ఇలానే వేధించాడంటూ మరికొందరు విద్యార్థినిలు ఆరోపించారు.

నిందితుడు సమీర్‌రాయ్‌పై గతంలోనూ పలుమార్లు తాను కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని బాధిత విద్యార్థిని ఆరోపించింది. దీంతో ఆందోళనకు దిగినట్టు పేర్కొంది. నిందితుడికి వ్యతిరేకంగా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో తాజాగా స్పందించిన అధికారులు నిందితుడిని సస్పెండ్ చేశారు. నిందితుడిపై తదుపరి చర్యలు ఉంటాయని కాలేజీ యాజమాన్యం తెలిపింది. 

లైంగికంగా తనకు సహకరిస్తే చదువులో సాయం చేస్తానని బాధితురాలికి నిందితుడు మెసేజ్‌లు చేశాడు. చదివిన తర్వాత వాటిని డిలీట్ చేయాలని కోరాడు. అంతేకాదు, ఆమెను దుస్తులు విప్పాలని కూడా కోరాడు. ఇందుకు సంబంధించిన వాట్సాప్ మెసేజ్‌ల స్క్రీన్‌షాట్లు బయటకు వచ్చాయి. అతడి మెసేజ్‌లకు ఒకసారి బాధిత విద్యార్థిని స్పందిస్తూ.. మీ భార్య ఏం చేస్తుందని అడిగింది. అందుకు ఆయన సమాధానం ఇవ్వకుండా ‘నువ్వు నాకు కావాలి’ అని సమాధానం ఇచ్చాడు. 

అంతేకాదు, ‘నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?’ అని కూడా అడిగాడు. అందుకామె బదులిస్తూ.. ఒక టీచర్‌గా మీరంటే తనకు ఇష్టమేనని, మీరు మంచివారని చెప్పింది. మరో మెసేజ్‌లో లైంగికంగా తనకు సహకరిస్తే బీపీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్)లో సహకరిస్తానని కూడా నిందితుడు ఆమెకు హామీ ఇవ్వడం గమనార్హం.

Harassment
Kolkata
Scottish Church College
PET
  • Loading...

More Telugu News