Team India: అడిలైడ్ టెస్టులో టాస్ గెలిచిన ఇండియా.. తుది జట్టులో కీలక మార్పులు

India opt to bat in Adilide test against Australia

  • బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ
  • తుది జట్టులోకి రోహిత్, శుభ్‌మాన్ గిల్, స్పిన్నర్ అశ్విన్
  • మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేస్తానన్న హిట్‌మ్యాన్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ షురూ అయింది. అడిలైడ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ పడింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

తుది జట్లు
భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా : ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.

జట్టులో కీలక మార్పులు
భారత తుది జట్టులో 3 మార్పులు చేసినట్టు కెప్టెన్ రోహిత్ వర్మ వెల్లడించారు. తాను (రోహిత్ శర్మ) తిరిగి వచ్చానని, శుభ్‌మాన్ గిల్, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా జట్టులోకి వచ్చారని చెప్పాడు. తాను మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్నానని, ఈ సవాలుకు సిద్ధంగా ఉన్నానని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ‘‘ మేము మొదట బ్యాటింగ్ చేస్తాం. పిచ్‌ మంచిగా కనిపిస్తోంది. పొడిగా, గడ్డి కూడా ఉంది. తొలుత ఫాస్ట్ బౌలర్లకు కొంత అనుకూలంగా ఉండవచ్చు. కానీ ఆ తర్వాత ఆట కొనసాగుతున్న కొద్దీ బ్యాటింగ్‌కు సానుకూలంగా ఉంటుంది. ఇది మంచి మ్యాచ్‌గా మారుతుందని అనుకుంటున్నా. నేను నెట్స్‌లో మంచి ప్రాక్టీస్ చేశాను. ఒక ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడాను. మ్యాచ్ ఆడడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. డ్రెస్సింగ్ రూమ్‌ వాతావరణం చాలా బాగుంది. ఆటగాళ్లు ఉత్సాహంగా కనిపిస్తున్నారు’’ అని కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News