Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం... డిప్యూటీ సీఎంలుగా షిండే, అజిత్ పవార్

Fadnavis oath taking ceremony

  • సీఎంగా ప్రమాణం చేయించిన గవర్నర్ రాధాకృష్ణన్
  • ముంబైలోని ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకారోత్సవం
  • హాజరైన ప్రధాని, ఏపీ సీఎం, కేంద్రమంత్రులు

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండే, ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. వారితో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఫడ్నవీస్ మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదానంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది.

ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, ఏపీ సీఎం చంద్రబాబు, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ సహా ఎన్డీయే పాలిత రాష్ట్రాల నుంచి 19 మంది సీఎంలు హాజరయ్యారు.

Devendra Fadnavis
Eknath Shinde
Narendra Modi
Chandrababu
Maharashtra
  • Loading...

More Telugu News