Sanjay Raut: షిండే శకం ముగిసింది... ఆయన ఇక ముఖ్యమంత్రి కాలేరు: సంజయ్ రౌత్

Eknath Shinde era over says Sanjay Raut

  • బీజేపీ ఇన్నాళ్లూ ఆయనను ఉపయోగించుకుందన్న రౌత్
  • అవసరమైతే షిండే పార్టీని విచ్ఛిన్నం చేయగలదని వ్యాఖ్యలు
  • మహాయుతిలో ఏదో జరుగుతోంది... రేపైనా బయటకొస్తుందన్న రౌత్

ఏక్‌నాథ్ షిండే శకం ముగిసిందని, ఇక ఆయన ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని శివసేన (యూబీటీ) వర్గం నేత సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ ఇన్నాళ్లూ షిండేను ఉపయోగించుకుందని, ఇప్పుడు పక్కకు పెట్టిందని ఆరోపించారు. ఇప్పుడు బీజేపీకీ ఆయన అవసరం కూడా లేదన్నారు. అవసరమైతే షిండే పార్టీని కూడా విచ్ఛిన్నం చేయగలదన్నారు. ఇది ప్రధాని మోదీ రాజకీయ వ్యూహం అని విమర్శించారు.

బీజేపీతో ఎవరైతే కలిసి పని చేస్తారో వారిని క్లోజ్ చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మెజార్టీ సీట్లు గెలుచుకుందని, కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వారికి 15 రోజుల సమయం పట్టిందన్నారు. అంటే, మహాయుతిలో ఏదో జరుగుతోందని అర్థం చేసుకోవచ్చన్నారు. ఏం జరుగుతుందనేది రేపైనా వెలుగు చూస్తుందన్నారు.

మహాయుతి కూటమి నేతలు మహారాష్ట్ర కోసమో... దేశం కోసమో పని చేయడం లేదన్నారు. వారు స్వార్థ రాజకీయాల కోసం, అధికారం కోసం ఒక్కటయ్యారన్నారు.

కాగా, ఈరోజు సాయంత్రం దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Sanjay Raut
Eknath Shinde
BJP
Congress
  • Loading...

More Telugu News