Shobita Dhulipalla: సెలబ్రెటీల పాపులర్ లిస్ట్ లో శోభిత తర్వాతే సమంత

IMDb Most Popular Actress In Industry

  • మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితా విడుదల చేసిన ఐఎండీబీ
  • ఈ ఏడాది ఎక్కువగా త్రిప్తి డిమ్రీ కోసం వెతికారని వెల్లడి
  • బ్యాడ్ న్యూజ్, లైలా మజ్ను చిత్రాల్లో నటించిన త్రిప్తి డిమ్రీ టాపర్

మోస్ట్ పాపులర్ నటీమణుల జాబితాలో శోభిత ధూళిపాళ ప్రముఖ నటి సమంతను వెనక్కి నెట్టారు. ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ పోర్టల్ ఐఎండీబీ విడుదల చేసిన జాబితాలో శోభిత ఐదో స్థానంలో ఉండగా సమంత ఎనిమిదో స్థానంలో నిలిచారు. ఈ ఏడాది ‘బ్యాడ్‌ న్యూజ్‌’, ‘లైలా మజ్ను’ రీరిలీజ్‌ ‘భూల్‌ భులయ్యా 3’ సినిమాలు విడుదలైన నేపథ్యంలో త్రిప్తి డిమ్రీ ఈ జాబితాలో టాపర్ గా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 250 మిలియన్ సందర్శకుల వాస్తవ వీక్షణల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ ఇచ్చినట్లు ఐఎండీబీ వెల్లడించింది. 

ఈ జాబితాలో రెండో స్థానంలో దీపికా పదుకొణే, మూడో స్థానంలో ఇషాన్ ఖత్తర్, నాలుగో స్థానంలో షారుక్ ఖాన్ నిలిచారు. ఐదో స్థానంలో శోభిత ధూళిపాళ ఉన్నారు. చైతూతో పెళ్లితో పాటు ఆమె నటించిన మంకీ మ్యాన్ విడుదల సందర్భంగా నెటిజన్లు ఆమె కోసం ఎక్కువగా సెర్చ్ చేశారని ఐఎండీబీ వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా శార్వరీ, ఐశ్వర్య రాయ్ ఉండగా ఎనిమిదో ర్యాంక్ ను సమంత దక్కించుకున్నారు. సమంత నటించిన ‘సిటడెల్‌: హనీ బన్నీ’ విడుదల, హీరోయిన్ అనారోగ్యం తదితర కారణాలతో నెటిజన్లు ఆమె కోసం ఎక్కువగా వెతికారని ఐఎండీబీ వెల్లడించింది.

Shobita Dhulipalla
IMDb
Samantha
Triptii Dimri
Citadel
Monkey Man
  • Loading...

More Telugu News