Virat Kohli: కోహ్లీ ఫిట్‌నెస్‌ సీక్రెట్ చెప్పేసిన భార్య‌ అనుష్క శ‌ర్మ‌... ఇదిగో వీడియో!

Anushka Sharma On Virat Kohlis Fitness Secret

  • విరాట్ ఫిట్‌నెస్ విష‌యంలో మూడింటికే అధిక ప్రాధాన్యత ఇస్తారన్న అనుష్క‌
  • నో జంక్ ఫుడ్‌, కూల్ డ్రింక్స్‌
  • నిద్రకు కూడా తగిన ప్రాధానత్య 
  • రోజూ ఉదయం నిద్ర‌ లేవగానే కార్డియో వర్కవుట్స్‌

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఫిట్‌నెస్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వ్యాయామం, డైట్‌కు ప్రాధాన్యమిస్తూ తన శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుంటాడీ స్టార్ ప్లేయ‌ర్‌. అందుకే విరాట్ త‌న ఆట‌తో పాటు ఫిట్‌నెస్‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇప్ప‌టికీ ఫిట్‌నెస్ విష‌యంలో యంగ్ ప్లేయ‌ర్లు కూడా అత‌డితో పోటీ ప‌డ‌లేరు. 

అయితే, కోహ్లీ ఫిట్‌నెస్‌ సీక్రెట్ ఏంటో అత‌ని భార్య‌, నటి అనుష్క శర్మ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో బయటపెట్టారు. విరాట్ ఫిట్‌నెస్ కు అధిక ప్రాధాన్యత ఇస్తాడని వివ‌రించారు. ఫిట్‌నెస్‌, ఆహారం విషయంలో క్రమశిక్షణతో ఉంటాడని ఆమె పేర్కొన్నారు. రోజూ ఉదయం నిద్ర‌ లేవగానే కార్డియో వర్కవుట్స్‌ చేస్తాడని తెలిపారు. తనతో కూడా క్రికెట్‌ ప్రాక్టీస్‌ చేస్తాడని అనుష్క చెప్పుకొచ్చారు. 

ఇక ఆహారం విషయానికి వస్తే... కోహ్లీ జంక్‌ ఫుడ్ జోలికి అస్సలు వెళ్ల‌డ‌ని చెప్పారు. అలాగే కూల్‌ డ్రింక్స్‌ వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉంటాడని అనుష్క తెలిపారు. దాదాపు ప‌దేళ్లుగా కోహ్లీ బటర్‌ చికెన్‌ తినలేదట‌. ఇక కోహ్లీ నిద్రకు కూడా తగిన ప్రాధానత్య ఇస్తాడని ఆమె పేర్కొన్నారు. క‌చ్చితంగా 8 గంటలపాటు ప్రశాంతంగా నిద్రపోతాడని వివరించారు. మంచి నిద్ర కార‌ణంగా తగిన విశ్రాంతి దొరుకుతుంద‌ని, దాంతో ఉద‌యం చాలా యాక్టివ్‌గా ఉంటామ‌ని అనుష్క శ‌ర్మ చెప్పుకొచ్చారు.


  • Loading...

More Telugu News