Kakinada Ship: స్టెల్లా షిప్ లో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారుల బృందం
- షిప్ లో మల్టీ డిసిప్లినరీ టీమ్ తనిఖీలు
- బియ్యం నమూనాలు సేకరించి నిజానిజాలను తేల్చనున్న బృందం
- షిప్ లో 640 టన్నుల బియ్యం ఉందని జిల్లా కలెక్టర్ ప్రకటన
పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం తరలిస్తున్న స్టెల్లా షిప్ ను కాకినాడ పోర్టులో అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ షిప్ లో రెవెన్యూ, పోలీసు, కస్టమ్స్, పోర్టు, పౌరసరఫరాల శాఖ అధికారుల బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. రేషన్ బియ్యం స్మగ్లింగ్ పై ఏపీ ప్రభుత్వం ఈ మల్టీ డిసిప్లినరీ కమిటీని వేసింది. బియ్యం నమూనాలను సేకరించి నిజానిజాలను ఈ టీమ్ నిగ్గుతేల్చనుంది.
ఈ షిప్ లో 640 టన్నుల పేదల బియ్యం ఉన్నట్టు కాకినాడ జిల్లా కలెక్టర్ గత నెల 27న ప్రకటించారు. 29వ తేదీన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించారు. బియ్యం స్మగ్లింగ్ పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 'సీజ్ ద షిప్' అంటూ ఆయన అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే షిప్ లో అధికారుల బృందం ఈరోజు మరోసారి తనిఖీలను చేపట్టింది.