Earthquake: భూకంపంతో కదిలిన సమ్మక్క గద్దెలు.. వీడియో ఇదిగో!

Mulugu Earthquake records In CCTV At Sammakka Gaddelu

  • ములుగు కేంద్రంగా ఈ ఉదయం భూకంపం
  • తెలంగాణని పలు జిల్లాలతోపాటు ఏపీలోనూ ప్రకంపనలు
  • మేడారం గద్దెల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ప్రకంపనల రికార్డు

ఈ ఉదయం ములుగు కేంద్రంగా సంభవించిన భూకంపం తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఉదయం 7.27 గంటలకు కొన్ని సెకన్లపాటు కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. భూకంప కేంద్రాన్ని ములుగులో భూమికి 40 కిలోమీటర్ల లోతున గుర్తించారు.  

హైదరాబాద్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్టణం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు సహా పలు ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. ములుగులో ఏర్పడిన భూకంప తీవ్రతకు మేడారంలోని సమ్మక్క-సారలమ్మ గద్దెలు కంపించాయి. 

గద్దెల వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో భూకంపం నమోదైంది. భక్తులు పూజలు చేస్తుండగా ఒక్కసారిగా కంపించింది. అయితే, పూజల్లో నిమగ్నమైన భక్తులు అదేమీ పట్టించుకోలేదు. మరో గద్దె వద్ద ఏర్పాటు చేసి సీసీ కెమెరాలో అక్కడున్న పూజారి తీవ్రతను అనుభవించడం కనిపించింది. ఏం జరిగిందో తెలియక ఆయన అయోమయంగా దిక్కులు చూస్తుండిపోయాడు.

  • Loading...

More Telugu News