Cybercrime: ఈ నంబర్ల నుంచి ఫోన్లు వస్తే లిఫ్ట్ చేయకండి.. తస్మాత్ జాగ్రత్త

Hyderabad cyber crime police warned not to pick up calls from these numbers

  • మూడు నిమిషాల్లోనే బ్యాంకు, క్రెడిట్‌ కార్డు, ఇతర వివరాల కాపీ
  • 90 లేదా 09 కోడ్‌లు ప్రెస్ చేయమంటే అస్సలు చేయవద్దు
  • అప్రమత్తం చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

అమాయకులను బురిడీ కొట్టించడమే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు రకరకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. ముఖ్యంగా సెల్‌ఫోన్లకు మెసేజులు పంపించడం, కాల్స్ చేయడం ద్వారా అమాయకుల బ్యాంకు ఖాతాలు, డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలను కాజేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ తరహాలోనే ఇటీవల కొన్ని విదేశీ నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తం చేశారు.  

ఆ నంబర్లు ఇవే..
అపరిచితుల నుంచి +56322553736, +37052529259, +94777 455913, +37127913091, +255901130460 నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తే అస్సలు లిఫ్ట్ చేయవద్దని పోలీసులు సూచించారు. ముఖ్యంగా +381 (సెర్బియా), +563 (లోవా), +370 (లిథువేనియా), +371 (లాత్వియా), +375 (బెలారస్‌), +255 (టాంజానియా) వంటి కోడ్‌ నంబర్లతో ఫోన్ రింగ్ అవుతోందని, లిఫ్ట్ చేశాక నేరగాళ్లు కాల్ హ్యాంగ్‌ చేస్తున్నారని, అమాయక యూజర్లు కాల్ బ్యాక్ చేస్తే కేవలం 3 సెకన్లలోనే ఫోన్‌లోని కాంటాక్ట్ లిస్ట్, బ్యాంక్, క్రెడిట్‌ కార్డుతో పాటు ఇతర వివరాలను కేవలం 3 సెకన్లలో కాపీ చేసుకునే ప్రమాదం పొంచి ఉందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ఇక అపరిచిత వ్యక్తులు కాల్ మాట్లాడుతూ హ్యాష్ 90 లేదా హ్యాష్ 09 నంబర్లను ప్రెస్ చేయాలని కోరితే నొక్కవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. పొరపాటున ఈ కోడ్‌లను ఎంటర్ చేస్తే యూజర్ సిమ్‌ కార్డు యాక్సెస్‌ కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంటుందని అప్రమత్తం చేశారు. ఈ విధంగా చేస్తే సదరు సిమ్ వినియోగదారుడిని నేరస్థుడిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించే అవకాశం ఉంటుందని, అంతేకాకుండా బాధిత యూజర్ల ఛార్జీలతో నేరగాళ్లు ఫోన్‌కాల్స్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News