Amaravati: అమ్మ కోరిక నెరవేర్చేందుకు.. అమరావతి కోసం రూ.1 కోటి విరాళం ఇచ్చిన మహిళ

A woman from Guntur district donated Rs 1 crore for the construction of Amaravati

  • రూ.1 కోటి విరాళం ఇచ్చిన గుంటూరు జిల్లా మహిళ విజయలక్ష్మి
  • హైదరాబాద్‌లో స్థలాన్ని విక్రయించి డొనేషన్
  • సీఎం చంద్రబాబుకు చెక్కు అందజేత

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతి పనులు తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని నిధులు రాబట్టేందుకు సీఎం చంద్రబాబు సర్కార్ ప్రయత్నాలు చేస్తూ ముందుకు కదులుతోంది. మరోవైపు విరాళాలు కూడా స్వీకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృష్ణా జిల్లాకు చెందిన ఓ మహిళ భారీ సాయం అందించారు. ఉంగుటూరు మండలం ఇందుపల్లి గ్రామానికి చెందిన పి. విజయలక్ష్మి అనే మహిళ ఏకంగా రూ. 1 కోటి డొనేషన్ ఇచ్చారు. మంగళవారం సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి ఆమె చెక్కును అందించారు. 

తన మాతృమూర్తి కోగంటి ఇందిరాదేవి కోరిక నెరవేర్చేందుకు అమరావతి నిర్మాణానికి ఈ భారీ విరాళం ఇచ్చినట్టు విజయలక్ష్మి తెలిపారు. హైదరాబాద్‌లో తమకు ఉన్న కొద్ది స్థలాన్ని విక్రయించి ఈ డబ్బును విరాళంగా ఇచ్చినట్టు వెల్లడించారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో తాము కూడా భాగస్వాములం కావాలనే సంకల్పించామని తెలిపారు. కాగా భారీ సాయం చేసిన విజయలక్ష్మిని సీఎం చంద్రబాబు అభినందించారు. విజయలక్ష్మి సాయం ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రశంసించారు. గొప్పత్యాగం చేశారంటూ మెచ్చుకున్నారు.

  • Loading...

More Telugu News