HYDRA: చెరువుల పరిరక్షణకు కఠిన నిర్ణయాలు తప్పవు: హైడ్రా కమిషనర్ రంగనాథ్

HYDRA commissioner participates in Jio Smart india meet
  • కొంతమంది ఇబ్బందిపడినా చర్యలు తప్పవన్న హైడ్రా కమిషనర్
  • శాటిలైట్ మ్యాప్ డేటా బేస్ ద్వారా హైడ్రా చెరువులను గుర్తిస్తున్నట్లు వెల్లడి
  • మ్యాప్ ద్వారా గుర్తించి ఆక్రమణలను తొలగిస్తున్నామన్న రంగనాథ్
కొంతమంది ఇబ్బందిపడినప్పటికీ చెరువులు, నాలాల రక్షణలో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిన జియో స్మార్ట్ ఇండియా రెండో సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జియో సైన్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైందన్నారు.

పారిశ్రామిక రంగాలతో పాటు ప్రభుత్వాలకు ఈ జియో స్పేషియల్ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతోందన్నారు. జియో స్పేషియల్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ప్రధానమైనదన్నారు.

శాటిలైట్ మ్యాప్ డేటా బేస్ ద్వారా హైడ్రా ఆయా ప్రాంతాల్లోని చెరువులను గుర్తిస్తోందన్నారు. ఇది చెరువుల సంరక్షణ కోసం ఎంతో ఉపయోగపడుతోందన్నారు. మ్యాప్ ద్వారా ఆక్రమణలను గుర్తించి తొలగిస్తున్నట్లు చెప్పారు. నాలాలు ఆక్రమణకు గురై వాటి మధ్య ఇంటర్ కనెక్టివిటీ పోయి వ్యర్థ జలాలు చెరువుల్లో కలుస్తున్నాయన్నారు.
HYDRA
AV Ranganath
Hyderabad

More Telugu News