Jagan: వైకల్యం శరీరానికే కానీ... సంకల్పానికి కాదు: జగన్
- నేడు అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవం
- ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన జగన్
- ఆత్మస్థైర్యంతో ముందుకు పోతున్నారంటూ కితాబు
అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవం సందర్భంగా వైసీపీ అధినేత జగన్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. వైకల్యం అనేది శరీరానికే కానీ... సంకల్పానికి కాదని జగన్ అన్నారు. ఆత్మస్థైర్యంలో తాము ఎవరికీ తీసిపోమని నిరూపిస్తూ అన్ని రంగాల్లో ముందుకు పోతున్న దివ్యాంగులందరికీ ప్రపంచ దివ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలని ట్వీట్ చేశారు.