HYDRA: హైడ్రాకు భారీగా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

TG governmet releases funds to HYDRA

  • రూ.50 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
  • ఉత్తర్వులు జారీ చేసిన పురపాలక శాఖ
  • కార్యాలయ నిర్వహణ, వాహనాల కొనుగోలు కోసం నిధుల విడుదల

వాహనాలను కొనుగోలు చేసేందుకు హైడ్రాకు తెలంగాణ ప్రభుత్వం నిధులు ఇచ్చింది. ఈ మేరకు హైడ్రాకు రూ.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులను విడుదల చేస్తూ తెలంగాణ పురపాలక శాఖ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. కార్యాలయ నిర్వహణ, వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసింది.

అల్మాస్‌గూడలో హైడ్రా కూల్చివేతలు

హైదరాబాద్‌లోని మహేశ్వరం నియోజకవర్గంలో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పోరేషన్‌లోని అల్మాస్‌గూడ గ్రామంలో శ్రీవెంకటేశ్వర కాలనీలోని పార్క్ స్థలంలో ఏర్పాటు చేసిన రెడిమేడ్ కంటైనర్‌ను హైడ్రా అధికారులు తొలగించారు. హైడ్రా ఇన్స్‌పెక్టర్ తిరుమలేశ్ ఆధ్వర్యంలో జేసీబీతో తొలగించారు.

HYDRA
AV Ranganath
Hyderabad
  • Loading...

More Telugu News