Indian Railways: రన్నింగ్ లో రెండుగా విడిపోయిన గూడ్స్ ట్రైన్.. వీడియో ఇదిగో!

A goods train broke into two near Mahabubabad station

  • మహబూబాబాద్ స్టేషన్ సమీపంలో ఘటన
  • సగం బోగీలను వదిలి ముందుకెళ్లిన రైలు
  • గార్డ్ అప్రమత్తతతో తప్పిన ముప్పు

వేగంగా వెళుతున్న గూడ్స్ ట్రైన్ రెండుగా విడిపోయింది.. మధ్యలో లింక్ తెగిపోవడంతో కొన్ని బోగీలు వెనకే ఉండిపోయాయి. సిగ్నల్ పడకున్నా రైలు స్లో అవుతోంది ఏంటని చూసిన గార్డ్ కు బోగీల మధ్య లింక్ తెగిపోయి కనిపించింది. దీంతో లోకో పైలట్ ను అప్రమత్తం చేయగా.. అతను రైలును నిలిపేసి అధికారులకు సమాచారం అందించారు. తెలంగాణలోని మహబూబాబాద్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

 రైల్వే అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం డోర్నకల్ రైల్వే స్టేషన్ నుంచి కాజీపేటకు వెళ్తున్న గూడ్స్ రైలు మహబూబాబాద్ స్టేషన్ సమీపంలో రెండుగా విడిపోయింది. బోగీల మధ్య లింక్ తెగడంతో వేగంగా వెళుతున్న గూడ్స్ రైలు ఇంజన్ నుంచి కొన్ని పెట్టెలు దూరమయ్యాయి. గూడ్స్ గార్డ్ వాకీటాకీ ద్వారా లోకో పైలట్ కు సమాచారం అందించి రైలును ఆపేశాడు. విషయం తెలిసి ఆ మార్గంలో వెళ్లాల్సిన రైళ్లను ఉన్నతాధికారులు నిలిపివేశారు. దీంతో ప్రమాదం తప్పినట్లయింది. ముందుకు వెళ్లిపోయిన రైలును వెనక్కి తీసుకువచ్చి లింక్ కలిపాక అధికారులు రైలును పంపించారు. కాగా, ఈ ఘటనపై అంతర్గత విచారణ జరిపిస్తామని, లింక్ తెగిపోవడానికి కారణాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Indian Railways
Goods Train
Delinked
Goods Gaurd
Train seperated
Dornakal
Kazipet

More Telugu News