Crime News: మోసం చేసిన సహచర విద్యార్థి.. కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య

19 year Bengaluru student dies by suicide after college mate cheats

  • కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘటన
  • క్యాసినోల్లో పెట్టుబడి పెడతానని నమ్మించి బంగారు ఆభరణాలు తీసుకున్న దిగంత్
  • మోసపోయానని గుర్తించి ఉరివేసుకున్న యువతి

పెట్టుబడులు పెడతానని నమ్మించి రూ. 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు తీసుకుని మోసగించడంతో 19 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. నవంబర్ 29న ప్రియాంక తన ఇంటి బాల్కనీలో ఉరివేసుకుంది. అంతకుముందు ఆమె రాసిన సూసైడ్ నోట్‌లో తన కాలేజ్ మేట్ దిగంత్‌పై పలు ఆరోపణలు చేసింది. పెట్టుబడులు పెడతానంటూ తన నుంచి రూ. 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు తీసుకున్నట్టు ఆరోపించింది. 

క్యాసినోల్లో పెట్టుబడులు పెడతానని ప్రియాంకను నమ్మించిన దిగంత్ ఆమె నుంచి బంగారు నగలు తీసుకున్నాడు. ఇటీవల తన నగలు తనకు ఇవ్వాలని ప్రియాంక కోరగా దిగంత్ దాటవేస్తూ వచ్చాడు. దీంతో తాను మోసపోయినట్టు గ్రహించిన ప్రియాంక ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. స్నేహితుడి చేతిలో మోసపోవడమే ప్రియాంక ఆత్మహత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News