: ఇక 'ఢిల్లీబెల్లీ'కి బై చెప్పవచ్చు!
భారతదేశం లాంటి పలు ఉష్ణ మండల దేశాలకు వచ్చేవారిని బాగా చిరాకు పరచే సమస్య ఢిల్లీబెల్లీ. కలుషిత ఆహారం, మంచినీటి కారణంగా వచ్చే వాంతులు, విరేచనాలు, ఇంకా కండరాలు పట్టుకుపోవడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. దీనినే 'ఢిల్లీబెల్లీ' లేదా ట్రావెలర్స్ టమ్మీగా వ్యవహరిస్తారు. ఇలాంటి అనారోగ్య సమస్యలకు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఒక సరికొత్త ఔషధాన్ని రూపొందించారు. దీనివల్ల ఈ సమస్యను సమూలంగా నిర్మూలించవచ్చని చెబుతున్నారు.
ఢిల్లీబెల్లీ అనారోగ్య సమస్యలు బ్యాక్టీరియా కారణంగా వస్తాయి. ఈ కారణంగా పలు ఇబ్బందులను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఇకపై ఇలాంటి అనారోగ్య సమస్యలను చక్కగా నివారించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాము రూపొందించిన ఈ కొత్త మాత్రకు ఢిల్లీబెల్లీ రోగకారక బ్యాక్టీరియాను సమూలంగా నిర్వీర్యం చేయగల శక్తి ఉన్నట్టు శాస్త్రవేత్తల బృందానికి సారధ్యం వహించిన ప్రొఫెసర్ స్లేటర్ చెబుతున్నారు.