AP High Court: సీసీ కెమెరాల నిర్వహణ నిర్లక్ష్యంపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు సూటి ప్రశ్న

high court how many cc cameras are working in jails and ps

  • పోలీస్ స్టేషన్‌, జైళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఎన్ని పని చేస్తున్నాయని ప్రశ్నించిన హైకోర్టు
  • కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ
  • తదుపరి విచారణ 23వ తేదీకి వాయిదా

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు, కారాగారాల్లో పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినప్పటికీ నిర్వహణ, సాంకేతిక లోపాల కారణంగా చాలా వరకు సీసీ కెమెరాలు పని చేయడం లేదు. పోలీస్ స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాలు తప్పనిసరి అంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో పురోగతి లేకపోవడంతో న్యాయవాది తాండవ యోగేశ్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. 

ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ ఆర్. రఘునందన్ రావు, జస్టిస్ కె. మహేశ్వరరావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం నిన్న విచారణ నిర్వహించింది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది విష్ణుతేజ వాదనలు వినిపించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,001 పోలీస్ స్టేషన్‌ల్లో పది వేలు, 81 జైళ్లలో 1,752 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని వివరించారు. 

దీనిపై ధర్మాసనం స్పందిస్తూ .. ఏర్పాటు చేసిన వాటిలో ఎన్ని పని చేస్తున్నాయి? పని చేయని వాటిని సరిచేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డీజీపీ, జైళ్ల శాఖ డీజీలను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది.     

  • Loading...

More Telugu News