Prime Minister: కేంద్ర మంత్రులతో కలిసి 'ది సబర్మతి రిపోర్టు' చిత్రాన్ని చూసిన మోదీ

prime minister modi watched the film sabarmati report

  • గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహనకాండ ఆధారంగా 'ది సబర్మతి రిపోర్టు' చిత్రం  
  • పార్లమెంట్ ప్రాంగణంలో కేంద్ర మంత్రులతో కలిసి చిత్రాన్ని వీక్షించిన ప్రధాని మోదీ
  • సామాన్యులకు కూడా అర్థమయ్యేరీతిలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉందన్న మోదీ

గుజరాత్‌లో 2002లో జరిగిన గోద్రా రైలు దహనకాండ దేశాన్ని కలచివేసిన విషయం తెలిసిందే. ఆ దుర్ఘటనలో 59 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహనకాండ ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ధీరజ్ సర్నా 'ది సబర్మతి రిపోర్టు' సినిమాను తెరకెక్కించారు. 

విక్రాంత్ మాస్కే, రాశీఖన్నా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. రిధి డోగ్రా కీలక పాత్ర పోషించారు. నవంబర్ 15న ఈ సినిమా విడుదలైంది. కాగా, పార్లమెంట్ ప్రాంగణంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ ఇతర మంత్రులు, ఎంపీలతో కలిసి ప్రధాని మోదీ ఈ చిత్రాన్ని వీక్షించారు. 

ఇటీవల ఓ నెటిజన్ ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూడాలంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్టుకు ప్రధాని మోదీ స్పందించారు. కల్పిత కథనాలు పరిమిత కాలమే కొనసాగుతాయని, సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉందని మోదీ పేర్కొన్నారు.   

Prime Minister
Narendra Modi
sabarmati report
  • Loading...

More Telugu News