Allu Arjun: మేం కష్టపడ్డాం అనేది చాలా చిన్నమాట... మా జీవితాలనే ఇచ్చేశాం: అల్లు అర్జున్

Allu Arjun speech in Pushpa2 pre release event

  • హైదరాబాదులో పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్
  • అల్లు అర్జున్ ఎమోషనల్ స్పీచ్
  • పేరుపేరునా అందరికీ కృతజ్ఞతలు చెప్పిన ఐకాన్ స్టార్

పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ భావోద్వేగాలతో ప్రసంగించారు. ఈ సినిమాలో తన సహనటులు, టెక్నీషియన్లను పేరుపేరునా అభినందించి, వారికి థ్యాంక్స్ చెప్పారు. 

"పుష్ప... పుష్పరాజ్... నీయవ్వ తగ్గేదే లే! పుష్ప-1 అప్పుడు చెప్పాను... తగ్గేదే లే అని చెప్పాను. అప్పటికింకా పుష్ప-2 కథ కూడా వినలేదు, ఏమీ వినలేదు... కానీ ఒక్క మాట మాత్రం చెబుతూనే ఉన్నా... అస్సలు తగ్గేదే లే! 

నేను ఇవాళ చాలామందికి థాంక్యూ చెప్పాలి. థాంక్యూకు మించి నేను చెప్పాల్సిందేమీ లేదు. నా అభిమానులను నా ఆర్మీ అని చెప్పుకుంటాను... నా అభిమానులంటే నాకు పిచ్చి. మా నిర్మాతలు రవిశంకర్, నవీన్ గారికి థాంక్స్. వీళ్లు కాకుండా ఇంకే ప్రొడ్యూసర్లు అయినా ఈ సినిమా అయ్యేది కాదు. మమ్మల్ని నమ్మి ఈ సినిమా మీద కోట్లు గుమ్మరించినందుకు రవి గారికి, నవీన్ గారికి థాంక్యూ సో మచ్! 

పుష్ప-1, పుష్ప-2 కలిపితే ఐదేళ్ల శ్రమ. అందుకు చెర్రీ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నేను అన్నిటికంటే ఎక్కువ విలువ దేనికిస్తానంటే... ఎవరు మనికి మాగ్జిమమ్ హ్యూమన్ ఎనర్జీ ఇచ్చారనేదానికి వాల్యూ ఇస్తాను. మా కెమెరామన్ కూబా గురించి చెప్పాలి... కూబా నువ్వు మా దిల్ రుబా. నువ్వు మమ్మల్నే కాదు, మీ దేశం పోలెండ్ కూడా గర్వపడేలా చేశావు. కూబా పనితనం ఎలా ఉంటుందో రేపు పుష్ప-2లో చూస్తారు. నేను దాన్ని మాటల్లో చెప్పి, ఆ ఘనతను తగ్గించలేను. సినిమా చూస్తే అర్థమవుతుంది. 

నా కొరియోగ్రాఫర్స్ గణేశ్ ఆచార్య మాస్టర్, శేఖర్ మాస్టర్, ప్రేమ్ రక్షిత్... అందరికీ థ్యాంక్స్. ఈ సినిమాలో లిరిక్స్ రాసిన చంద్రబోస్ గారికి, ఈ సినిమాకు మిగతా భాషల్లో లిరిక్స్ రాసిన అందరు రైటర్లకు కూడా థ్యాంక్స్. 

మై రాక్ స్టార్ ఫ్రెండ్ దేవి శ్రీ ప్రసాద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. దేవీ ఐ లవ్యూ. 20 ఏళ్ల జర్నీ మాది. అంత జర్నీని ఈ స్టేజిపై చెప్పలేం కదా. నువ్వు ఇచ్చిన పాటలకు, సంగీతానికి థ్యాంక్స్ దేవీ. సాంగ్స్ అందరూ ఇస్తారు దేవీ... కానీ నువ్వు నా కోసం ఎక్స్ ట్రా లవ్ తో పాటలు ఇస్తావు... ఆ ప్రేమకు థాంక్యూ. 

ఇక నా ఆర్టిస్టుల గురించి చెప్పాలి. ఫహాద్ ఫాజిల్ ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు. రేపు పుష్ప-2లో ఫస్టాఫ్ చూస్తే అతడి పెర్ఫార్మెన్స్ కు ఆశ్చర్యపోతారు. కేరళలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలందరూ గర్వించేలా నటించాడు. ఫఫా (ఫహాద్ ఫాజిల్) నాకు బ్రదర్ లాంటివాడు. కేరళ వాళ్లు నన్ను వాళ్ల దత్తపుత్రుడిగా భావిస్తారు. ఈ దత్త పుత్రుడి నుంచి కేరళ నిజమైన పుత్రుడికి శుభాభినందనలు. అందరితోపాటు నేను కూడా రేపు సినిమాలో నీ పెర్ఫార్మెన్స్ చూసేందుకు ఎదురుచూస్తున్నాను. 

రావు రమేశ్, సునీల్ ప్రభావవంతంగా నటించారు. శ్రీలీల గురించి చెప్పాలంటే... ఆమెకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. శ్రీలీల ఎంతో క్యూట్. ఆమె డ్యాన్సులు ఇంతకుముందు చూశాను. ఈ తరం తెలుగమ్మాయిలకు నువ్వు ఇన్ స్పిరేషన్ అవుతావు. మమ్మల్ని గర్వించేలా చేస్తావని ఆశిస్తున్నానమ్మా! ఇక, గత ఐదేళ్లుగా శ్రీవల్లి (రష్మిక) తప్ప నాకు మరో అమ్మాయి తెలియదు. రష్మిక థాంక్యూ సో మచ్. 

రష్మిక గురించి చెప్పాలంటే... పీలింగ్స్ సాంగ్ షూటింగ్ చేస్తున్నాం. రాత్రి 2.30 గంటలకు షూటింగ్ ప్యాకప్ అయితే, మళ్లీ ఉదయం 8 గంటలకే ఆమె సెట్స్ పైకి వచ్చేసేది. నేనైనా కొంచెం అలసిపోయి 8.50 గంటలకు వచ్చేవాడ్ని. రష్ (రష్మిక) నీకెంత మంచి పేరు రావాలో... అదంతా ఈ సినిమాతో కొడతావు. అందుకు నువ్వు అర్హురాలివి. 

సుకుమార్ గురించి ఎంత చెప్పినా తక్కువైపోతుంది. ఆయన నా కోసమే ఈ సినిమాలు చేశానని చెప్పారు... ఇప్పుడు నేను చెబుతున్నాను... పుష్ప-1 కానీ, పుష్ప-2 కానీ... ఈ సినిమాల క్రెడిట్ అంతా సుకుమార్ కే దక్కుతుంది. ఇంత మంచి దర్శకుడు మన తెలుగులో ఉన్నారా అనే ఫీలింగ్ అందరిలో కలిగిస్తారు.

ఈ సినిమా కోసం మేం కష్టపడ్డామంటే అది చాలా చిన్నమాట... ఈ సినిమా కోసం మా జీవితాలను ఇచ్చేశాం. సుకుమార్ అంటున్నారు... ఈ సినిమాలు బన్నీ కోసమే చేశాను అంటున్నారు. అసలు... సుకుమార్ లేకపోతే నేను లేను... ఆర్య సినిమా లేకపోతే నేను లేను. 

ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతో త్యాగం చేశారు. వారందరి కోసం అయినా సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. బాహుబలి సినిమా బాగా ఆడినప్పుడు మనమంతా గర్వించాం. అక్కడున్నది ప్రభాస్ గారా, రాజమౌళి గారా అనేది ఆలోచించలేదు. మన స్థాయి పెంచిన సినిమా అని ఆనందించాం. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ చిత్రం కూడా అంతర్జాతీయంగా ఎంతో పేరు తెస్తుందని ఆలోచించాం. ఇప్పుడు పుష్ప సినిమాకు కూడా యావత్ భారతదేశం నుంచి ప్రేమ లభించింది. 

ఆడియన్స్ కు ది బెస్ట్ ఇవ్వాలని మేం మా సర్వశక్తులు ధారపోశాం. మేం ఎంత కష్టపడ్డామో రేపు మీరు సినిమాలో చూస్తారు. ఈ సినిమాను 80 దేశాల్లో 12 వేల స్క్రీన్లపై విడుదల చేస్తున్నాం. ఇది మాకు పండుగ లాంటిది. ఎప్పుడూ లేనంతగా 12 వేల స్క్రీన్లలో పుష్ప-2 వస్తోంది. చివరగా మై డియర్ ఫ్యాన్స్... ఐ లవ్ మై ఫ్యాన్స్... ఈ సినిమా హిట్టయితే మీకు అంకితం చేద్దామనుకుంటున్నా... నా కష్టాన్ని మాత్రం మీకు అంకితం ఇచ్చేస్తున్నా.

అల్లు అర్జున్ కోసమే పుష్ప చేశాను: సుకుమార్

నా ప్రస్థానం ఆర్యతో స్టార్టయింది. బన్నీ ఎలా ఎదుగుతున్నాడో చూస్తూ వచ్చాను. వ్యక్తిగా, ఒక ఆర్టిస్ట్ గా నేను దగ్గరుండి చూశాను. ఈ పుష్ప-1 కానీ, పుష్ప-2 ఈ రేంజిలో వచ్చాయంటే అల్లు అర్జున్ పై నాకున్న ప్రేమ కారణంగానే. మా ఇద్దరి బాండింగ్ ఎలా ఉంటుందంటే... ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పొచ్చు. 

ఒక చిన్న ఎక్స్ ప్రెషన్ కోసం కూడా అల్లు అర్జున్ ఎంతో శ్రమిస్తాడు. కనుపాపను కదిలించాలన్నా, లిప్ మూవ్ చేయాలనో, గొంతు వణికినట్టుగా పలికించాలన్నా అందుకోసం ఒక పోరాటమే చేస్తాడు. పర్ఫెక్షన్ కోసం ఒక స్టార్ పడే తపన చూస్తే ఏ దర్శకుడికైనా మామూలు ఎనర్జీ రాదు. డార్లింగ్ నువ్వు నమ్ము నమ్మకపో... నేను ఈ సినిమా చేయడం కేవలం నీ కోసమే, నీ మీద ప్రేమ తప్ప ఇంకేదీ కారణం కాదు. 

నిజంగా చెప్పాలంటే... నీతో ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర కథ లేదు. ఏవో రెండు సీన్లు చెప్పి క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పాను. నువ్వు ఇచ్చే ఎనర్జీతో... ఈ వ్యక్తి కోసం ఏమైనా చేయాలి అనిపిస్తుంది. పుష్ప సినిమాలతో అల్లు అర్జున్ ఒక రేంజ్ సెట్ చేశాడు. నేను గానీ, ఇతర టెక్నీషియన్లు గానీ, ఎవరైనా సరే ఆ హైట్ కు వెళ్లి చేయాల్సిందే. 

ఒక వ్యక్తి లైఫ్ లోంచి మూడు సంవత్సరాలు తీసుకోవడం మామూలు విషయం కాదు. సారీ డార్లింగ్ నీ ప్రైమ్ టైమ్ ను తీసుకున్నాను. ఇప్పుడు పుష్ప-3 కోసం ఆయనను ఇబ్బంది పెట్టలేను. ఈ చిత్ర నిర్మాతల ఎదుగుదలను చూడడం సంతోషంగా అనిపిస్తుంది. 

కెమెరామన్ కూబా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తన విజన్ వేరే లెవల్లో ఉంటుంది. కూబా లేకుండా ఒక్క ఫ్రేమ్ ను కూడా ఊహించలేను. ఇక శ్రీవల్లి గురించి మాట్లాడాలి. ఎడిట్ చేస్తున్నప్పుడు, సినిమా చూస్తున్నప్పుడు తన క్లోజప్స్ చూస్తూ కూర్చుండి పోతాను. ఒక్కోసారి నేను చెప్పాల్సిన అవసరం లేకుండానే సీన్ చేసేస్తుంది. ఒక్కసారి చెబితే వెంటనే చేసేస్తుంది... మా మధ్య ఎక్కువ డిస్కషన్ కూడా అవసరంలేదు. అంతగా ఫ్రీక్వెన్సీ కుదిరింది. 

ఎవరైనా నా జీవితంలోకి వస్తే వారితో బాండింగ్ కొనసాగుతుంటుంది. దేవి శ్రీ ప్రసాద్ కూడా వారిలో ఒకరు. నువ్వు క్లైమాక్స్ కు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతం. సినిమాను ఎక్కడికో తీసుకెళ్లావ్. 

ఇక శ్రీలీల గురించి చెప్పాలి. నీకు మంచి ఫ్యూచర్ ఉంది. పుష్ప-2 ఐటమ్ సాంగ్ లో నీ మూవ్ మెంట్స్ అమేజింగ్. నీ తెలుగు ఎంతో ముద్దొస్తుంది. మెసేజ్ లు కూడా తెలుగులోనే పెడుతున్నావు... ఈ రోజుల్లో ఒకమ్మాయి తెలుగులో ఇంత అందంగా మాట్లాడుతుందంటే మామూలు విషయం కాదు... గాడ్ బ్లెస్ యూ. 

సరిహద్దులను చెరిపివేసిన నటుడు అల్లు అర్జున్: రష్మిక

హాయ్ అండీ బాగున్నారా అందరూ... అందరూ చిల్ అయ్యారా! మేం పుష్ప-2 ప్రమోషన్స్ కోసం దేశమంతా ఎక్కడెక్కడో తిరిగాం. కానీ మా టీమ్ గురించి ఎక్కడా పెద్దగా మాట్లాడలేదు. ఇవాళ్టి ఈవెంట్లో అందరి గురించి మాట్లాడతాను. పుష్ప-1 ను మించి పుష్ప-2లో పెర్ఫార్మెన్స్ ఇవ్వాలనుకున్నాను. ఈ చిత్రంలో నా నటనకు క్రెడిట్ అంతా సుకుమార్, బన్నీలకే దక్కుతుంది. 

సుక్కు సర్ కు సిగ్గు ఎక్కువ. ఆయన ఎవరితో ఎక్కువగా మాట్లాడరు. పుష్ప-2కి వచ్చే సరికి ఆయనతో ఏ విషయమైనా మాట్లాడేంత చనువు వచ్చేసింది. అల్లు అర్జున్ సర్ గురించి ఏం చెప్పాలి... ఆయన గురించి చెప్పాలంటే మాటలు రావడంలేదు. ఆయన ఐకాన్ స్టార్. సరిహద్దులను చెరిపివేసిన నటుడు అల్లు అర్జున్ గారు. ఇప్పుడు పుష్ప-2తో అంతర్జాతీయంగా వైల్డ్ ఫైర్ సృష్టిస్తారు. 

ఈ చిత్రం కచ్చితంగా అన్ని రికార్డులు బద్దలు కొడుతుందని ఆశిస్తున్నాను. ఇదంతా అల్లు అర్జున్ సర్, సుకుమార్ సర్ కృషి వల్లే. ఇక, అభిమానుల వల్లే ఈ స్థాయిలో ఉన్నాను. నేను జాతీయ స్థాయి వెళ్లినా, ఎక్కడికి వెళ్లినా అభిమానుల వల్లే. 

ఇప్పుడు నేను కిస్సిక్ లీల అయిపోయాను: శ్రీలీల

పుష్ప ప్రపంచంలో నాక్కూడా కొంచెం చోటు కల్పించినందుకు దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ లకు కృతజ్ఞతలు. దేవి శ్రీ ప్రసాద్ రూపకల్పన చేసిన ఐటమ్ సాంగ్ తో ఇప్పడు నేను కిస్సిక్ లీల అయిపోయాను. సాధారణంగా ఇద్దరు అమ్మాయిలు ఒక చోట ఉంటే  వాళ్ల మధ్య అతలాకుతలం అయిపోతుందంటారు... కానీ నేను, రష్మిక ఒక చోట ఉంటే మిగతా వాళ్లు అతలాకుతలం అయిపోతారు. 

పుష్ప-2 ఊహకందనంత ఎత్తులో ఉంది: దేవి శ్రీ ప్రసాద్

హలో హైదరాబాద్... పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కావడం చాలా చాలా సంతోషంగా ఉంది. పుష్ప-1 తర్వాత మళ్లీ ఇంత గ్రాండ్ గా, ఊహకందనంత ఎత్తులో ఉంది పుష్ప-2. అందుకు ఎంతో గర్విస్తున్నాను... అదే సమయంలో ఈ చిత్రంలో నేను కూడా ఓ భాగం కావడం పట్ల సంతోషంగా ఉంది. 

ఈ సందర్భంగా నా మ్యూజిక్ టీమ్ కు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వాళ్ల వల్లే నాకు నేషనల్ అవార్డు వచ్చింది. మమ్మల్ని జాతీయస్థాయికి కాదు... అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన డార్లింగ్ సుకుమార్ కు థ్యాంక్స్. 

లిరిక్ రైటర్ చంద్రబోస్ గురించి చెప్పాలి. ఎప్పుడైనా ఒక పాట హిట్టయిందంటే అందులోని మ్యూజిక్ మాత్రమే కాదు, అందులోని ప్రతి పదం కూడా ముఖ్యమైనదే. అందుకే నేను లిరిక్ ను ఫేస్ ఆఫ్ ద సాంగ్ అని చెబుతాను. ఈ చిత్రంలో చంద్రబోస్ ప్రతి పాటను ఎంతో మ్యాజికల్ గా రాశారు. 

  • Loading...

More Telugu News