Lagacharla: లగచర్ల కలెక్టర్‌పై దాడి ఘటనలో నిందితుడు సురేశ్‌కు పోలీస్ కస్టడీ
- రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించిన కోర్టు
- రేపు, ఎల్లుండి విచారించనున్న న్యాయస్థానం
- దాడి ఘటనలో గత నెల 19న న్యాయమూర్తి ఎదుట లొంగిపోయిన సురేశ్
వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్‌పై దాడి కేసులో నిందితుడు సురేశ్‌ను కొడంగల్ కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది. లగచర్ల ఘటనలో సురేశ్ ఏ2 నిందితుడిగా ఉన్నాడు. రెండు రోజుల పాటు విచారణకు అనుమతించడంతో రేపు, ఎల్లుండి పోలీసులు అతనిని విచారించనున్నారు.
లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి కేసులో ఏ2 నిందితుడు సురేశ్ రాజ్ గత నెల 19న కొడంగల్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట లొంగిపోయాడు. ఈ కేసులో అరెస్టైన నిందితులకు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితులను సంగారెడ్డి జైలుకు తరలించారు. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై ప్రధాన నిందితుడిగా అభియోగం మోపిన పోలీసులు అతనిని కూడా అరెస్ట్ చేశారు.