Svalbard: ఈ ద్వీప సముదాయంలో నివసించడానికి, పని చేయడానికి వీసా అక్కర్లేదు!

Svalbard offers no visa policy to live and work

  • విదేశీయులకు ద్వారాలు తెరిచిన స్వాల్ బార్డ్
  • నో వీసా పాలసీ అమలు చేస్తున్న పాలకులు
  • ఎటు చూసినా మంచు దిబ్బలే... జనజీవనం ఓ సవాలు

ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే వీసా, పాస్ పోర్టు అవసరమని తెలిసిందే. అయితే, ఆర్కిటిక్ మహాసముద్రంలోని ఓ ద్వీప సముదాయంలో నివసించడానికి కానీ, పని చేయడానికి కానీ వీసా అక్కర్లేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ ద్వీప సముదాయం పేరు స్వాల్ బార్డ్. ఇది నార్వే దేశం పరిధిలోకి వస్తుంది. 

స్వాల్ బార్డ్ పాలకులు తమ ప్రాంతంలో నివసించడానికి, ఉద్యోగాలు, ఇతర పనులు చేసుకోవడానికి విదేశీయులను ఆహ్వానిస్తున్నారు. మీరు అమెరికన్లయినా, ఇతర యూరోప్ దేశాల ప్రజలైనా, ప్రపంచంలో ఇంకెక్కడి వారైనా సరే... మా ప్రాంతానికి వచ్చేయండి అంటూ స్వాల్ బర్డ్ ప్రభుత్వం ఆహ్వానం పలుకుతోంది. వీసాలు, ఇతర అనుమతుల అవసరంలేదంటూ ప్రకటనలు ఇస్తోంది. 

అయితే,  ఇక్కడే ఒక చిన్న మెలిక ఉంది. సాధారణంగా యూరప్ పర్యటనకు వచ్చేవారు షెంజెన్ వీసా తీసుకుంటారు. ఈ షెంజెన్ వీసా ఉంటే యూరప్ లోని 27 దేశాల్లో నిరభ్యంతరంగా పర్యటించవచ్చు. ఆ దేశాల్లో నార్వే కూడా ఒకటి. స్వాల్ బర్డ్ చేరుకోవాలంటే నార్వే మీదుగానే రావాలి కాబట్టి... షెంజెన్ వీసా తప్పనిసరి. 

ఇక ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. ఈ స్వాల్ బర్డ్ ప్రాంతం 60 శాతం మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ సాధారణ జనజీవనం ఓ సవాల్ అని చెప్పాలి. ఆర్కిటిక్ వలయానికి దగ్గరగా, ఆర్కిటిక్ మహాసముద్రంలో ఉంటుందీ ద్వీప సముదాయం. 

ఎటు చూసినా మంచు దిబ్బలే కనిపిస్తుంటాయి. సాధారణంగా ఇక్కడ మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ధ్రువ ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి  రాత్రివేళలు సుదీర్ఘంగా ఉంటాయి. వేసవిలో ఇక్కడ 24 గంటలూ ఎండ కాస్తుంది.

  • Loading...

More Telugu News