Stock Market: మళ్లీ 80 వేల పాయింట్లు దాటిన సెన్సెక్స్

Sensex again crosses 80K mark

  • నష్టాల్లో ప్రారంభమై.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు
  • 445 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 144 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు... మధ్యాహ్నం తర్వాత మళ్లీ పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, రిలయన్స్ వంటి కంపెనీల షేర్లు మార్కెట్లను ముందుండి నడిపించాయి. 

సెన్సెక్స్ మరోసారి 80 వేల మార్కును అధిగమించింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 445 పాయింట్లు లాభపడి 80,248కి ఎగబాకింది. నిఫ్టీ 144 పాయింట్లు పెరిగి 24,276 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (3.93%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (2.47%), అదానీ పోర్ట్స్ (2.18%), టెక్ మహీంద్రా (1.81%), టైటాన్ (1.73%). 

టాప్ లూజర్స్:
ఎన్టీపీసీ (-1.55%), కొటక్ బ్యాంక్ (-0.70%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.69%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.60%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.49%).   

  • Loading...

More Telugu News