AP & TG: రెండు తెలుగు రాష్ట్రాల సీఎస్ ల కీలక భేటీ

AP and TG CSs meeting

  • మంగళగిరిలో కొనసాగుతున్న కీలక భేటీ
  • విభజన సమస్యలపై చర్చిస్తున్న అధికారుల కమిటీ
  • సీఎంల భేటీలో చర్చకు వచ్చిన అంశాలపై మరింత లోతుగా చర్చ

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారం దిశగా మరో కీలక అడుగు పడింది. ఇప్పటికే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు హైదరాబాద్ లో ఒకసారి భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలనే దానిపై వీరిద్దరూ ప్రాథమిక చర్చలు జరిపారు. 

తాజాగా ఈరోజు ఇరు రాష్ట్రాల సీఎస్ లు భేటీ అయ్యారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో వీరి సమావేశం కొనసాగుతోంది. విభజన అంశాలపై ఏపీలో జరుగుతున్న తొలి భేటీ ఇదే కావడం గమనార్హం. 

రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలపై అధికారుల కమిటీ చర్చిస్తోంది. 2024 జూలై 5న రెండు రాష్ట్రాల సీఎంల సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలపై మరింత లోతుగా వీరు చర్చిస్తున్నారు. 

  • Loading...

More Telugu News