Eknath Shinde: ఉపముఖ్యమంత్రి పదవిపై ఏక్‌నాథ్ షిండే తనయుడి కీలక వ్యాఖ్యలు

Eknath Shinde son says he is not in dy CM race

  • ఉపముఖ్యమంత్రి పదవి రేసులో తాను లేనని వెల్లడి
  • కేంద్రమంత్రిగా అవకాశం వచ్చినా పార్టీ కోసం వదులుకున్నట్లు వెల్లడి
  • ఇప్పటికైనా ఈ ప్రచారం ఆగిపోతుందని భావిస్తున్నానన్న శ్రీకాంత్ షిండే 

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి పదవిపై, కేంద్రమంత్రి పదవిపై ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ షిండే తనయుడు శ్రీకాంత్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్తగా ఏర్పడనున్న మహారాష్ట్ర ప్రభుత్వంలో తాను ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయని, కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు.

మహాయుతి ప్రభుత్వం కొలువుదీరడానికి ముందు రకరకాల ప్రచారం జరుగుతోందని, కానీ ఆ కథనాలు నిరాధారమైనవన్నారు. తన తండ్రి ఏక్‌నాథ్ షిండే అనారోగ్యం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నట్లు చెప్పారు. గత లోక్ సభ ఎన్నికల తర్వాత తనకు కేంద్రమంత్రిగా అవకాశం వచ్చిందని, కానీ పార్టీ కోసం పని చేయాలనే ఉద్దేశంతో తాను ఆ పదవిని నిరాకరించానని అన్నారు.

పదవి కావాలనే కోరిక తనకు లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి మంత్రి పదవి రేసులో తాను లేనని స్పష్టం చేశారు. తమ పార్టీ కోసం, అలాగే తన నియోజకవర్గం కోసం పని చేస్తానన్నారు. కొత్త ప్రభుత్వంలో తాను పదవిని చేపడతాననే ప్రచారం ఇప్పటికైనా ఆగిపోతుందని భావిస్తున్నానన్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి అద్భుత విజయం సాధించింది. సీఎం పదవి, మంత్రి పదవుల కేటాయింపులకు సంబంధించి చర్చల నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమవుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి పదవి సీఎం ఫడ్నవీస్‌కు ఖరారైంది. ఈ నేపథ్యంలో షిండే తనయుడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టవచ్చని ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు.

  • Loading...

More Telugu News