Drunk Woman: క్వార్టర్ మందు కొట్టి పోలీస్ స్టేషన్ లో హంగామా చేసిన హైదరాబాద్ మహిళ... వీడియో వైరల్

Drunk woman creates ruckus in Uppal Police Station

  • మద్యం మత్తులో పీఎస్ కు వచ్చిన మహిళ
  • బ్రీత్ ఎనలైజర్ తో టెస్టు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులు
  • ఇష్టం వచ్చినట్టు ఊదుతూ పోలీసులను బాగా విసిగించిన మహిళ

హైదరాబాదులో ఓ మహిళ మద్యం మత్తులో పోలీస్ స్టేషన్ లో రచ్చ చేసింది. అవును... నేను తాగాను... బరాబర్ క్వార్టర్ తాగాను... ఏం చేస్తారు? అంటూ సవాల్ విసిరింది. సదరు మహిళ ఉప్పల్ రామంతపూర్ లోని వివేక్ నగర్ నివాసిగా గుర్తించారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయాగా పనిచేస్తోంది. మద్యం మత్తులో ఇతరులను దూషించడం, తిరిగి వారిపైనే ఫిర్యాదు చేయడం ఆమెకు అలవాటేనని పోలీసులు చెబుతున్నారు. 

తాజాగా ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు మద్యం మత్తులో వచ్చిన ఆ మహిళ... పీఎస్ లో హంగామా సృష్టించింది. బ్రీత్ ఎనలైజర్ లో ఊదమని చెబితే.... ఆమె ఇష్టం వచ్చినట్టు ఊదడంతో... ఇలా కాదమ్మా... మేం చెప్పేంత వరకు ఊదుతూనే ఉండాలి అని పోలీసులు చెప్పారు. 

దాంతో తీవ్ర అసహనానికి గురైన ఆ మహిళ... నేను బరాబర్ క్వార్టర్ తాగానని చెబుతుంటే, ఇంకా ఎందుకు ఊదాలి? అంటూ పోలీసులను తిరిగి ప్రశ్నించింది. పోలీసులు ఎంత చెప్పినా వినకుండా బాగా విసిగించింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

Drunk Woman
Police Station
Hyderabad
Viral Video

More Telugu News