Donald Trump: వియ్యంకుడికి కీలక పదవిని కట్టబెడుతున్న ట్రంప్
- ప్రభుత్వ కూర్పుపై దృష్టి సారించిన ట్రంప్
- వియ్యంకుడు మసాద్ కు అరబ్, పశ్చిమాసియా వ్యవహారాల సలహాదారుడి పదవి
- మసాద్ కుమారుడిని పెళ్లాడిన ట్రంప్ కూతురు టిఫానీ
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇప్పటికే తన ప్రభుత్వ కూర్పుపై ఆయన దృష్టి సారించారు. యువ నేతలకు, తన గెలుపు కోసం కృషి చేసిన వారికి ఆయన కీలక పదవులను కట్టబెడుతున్నారు. తన బంధువర్గాన్ని కూడా పాలకవర్గంలోకి తీసుకుంటున్నారు.
తన వియ్యంకుడు, లెబనీస్-అమెరికన్ వ్యాపారవేత్త అయిన మసాద్ బౌలోస్ ను అరబ్, పశ్చిమాసియా వ్యవహారాల సీనియర్ సలహాదారుగా నియమిస్తున్నట్టు ట్రంప్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మసాద్ కుమారుడు మైఖేల్ బౌలోస్ ను ట్రంప్ కుమార్తె టిఫానీ పెళ్లాడారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో గాజా అంశంపై అసంతృప్తిగా ఉన్న అరబ్ అమెరికన్, ముస్లిం ఓటర్లను ట్రంప్ వైపుకు మళ్లించడంలో మసాద్ కీలక పాత్ర పోషించారు.