Ayurveda: ఆయుర్వేదం ప్రకారం ఇవి అమృతం.. వాటికి ఎందుకింత ప్రత్యేకత?

foods that are called amrit in ayurveda

  • మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాల్లోనే కొన్ని అద్భుతాలు
  • మన శరీరానికి అత్యంత మేలు చేసే పదార్థాలు
  • వాటిని అమృతంతో సమానమని చెప్పిన ఆయుర్వేదం

ఆహారం లేకుండా జీవులేవీ బతకలేవు. కచ్చితంగా ఏదో ఒక ఆహారం తింటూ బతికేస్తుంటాయి. మనుషుల శరీరంలో వ్యవస్థలన్నీ సరిగా పనిచేయడానికి, ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి కొన్ని రకాల ఆహారం, పోషకాలు తప్పనిసరి. ఈ క్రమంలోనే ఆయుర్వేదం కొన్నిరకాల పదార్థాలను అమృతంగా పేర్కొంది. ఆ ఆహారం శరీరానికి అందితే... చాలా రకాల ఇబ్బందులు తప్పుతాయని పేర్కొంది. నిపుణులు చెప్పిన ప్రకారం ఆ ఆహారం ఏమిటో తెలుసుకుందామా...

అశ్వగంధ...
మనలో ఒత్తిడిని తగ్గించి...సత్తువను, రోగ నిరోధక శక్తిని పెంచే అద్భుత లక్షణాలు అశ్వగంధ సొంతం. శరీరంలో శక్తిని పెంచడమే కాదు... మంచి నిద్రను కూడా ఇస్తుంది. వయసు మీద పడటం వల్ల వచ్చే లక్షణాలను తగ్గిస్తుంది.

పసుపు బంగారం
ఆయుర్వేదం పసుపును బంగారంతో సమానంగా పేర్కొంది. మన జీర్ణ వ్యవస్థ నుంచి రోగ నిరోధక వ్యవస్థ దాకా, మన చర్మం ఆరోగ్యం దాకా... పసుపు ఎంతో మేలు చేస్తుందని పేర్కొంది. అందుకే భారతీయ వంటకాల్లో దాదాపు అన్నింటిలో కూడా కచ్చితంగా పసుపును వాడుతారు.

తిప్పతీగ...
ఏదో పిచ్చి మొక్కల్లో ఒకటిగా పెరిగే తిప్పతీగ (గిలోయ్) ఆయుర్వేదం ప్రకారం అమృతమే. మన రక్తాన్ని సుద్ధి చేయడంలో, జీర్ణ వ్యవస్థను బాగా పనిచేయించడంలో దీన్ని మించినది లేదని ఆయుర్వేదం చెబుతుంది. మనలో ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలనూ ఇది నియంత్రిస్తుంది. కరోనా సమయంలో గిలోయ్ రసం తాగిన వాళ్లు వేగంగా కోలుకున్నట్టు వైద్య నిపుణులు కూడా గుర్తించారు.

నెయ్యి...
ప్రాశ్చాత్య ఆలోచనా విధానం ప్రకారం నెయ్యి అంటే విపరీతమైన కొవ్వులు ఉండే పదార్థం. కానీ ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం... నెయ్యి మన శరీరానికి అవసరమైన కీలక పోషకాలను అందిస్తుంది. మనం తినే ఆహారంలోని పోషకాలను శరీరం సమర్థవంతంగా శోషించుకునేలా చేస్తుంది. మన మెదడు చురుకుగా పనిచేసేలా చేస్తుంది. అయితే... దీనిని పరిమితంగానే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఉసిరి (ఆమ్లా)...
అత్యధిక స్థాయిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఉసిరి... శరీరానికి ఎన్నో విధాల మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థకు మేలు చేయడంతోపాటు కాలేయం సరిగా పనిచేయడానికి, కేశ సంరక్షణకు ఇది చాలా కీలకమని వివరిస్తున్నారు.

తేనె...
దీని పేరు చెప్పగానే అధిక చక్కెర మోతాదులు, మధుమేహం ఉన్నవారు దూరంగా ఉండాలన్న సూచనలు గుర్తుకొస్తాయి. కానీ తేనె మరెన్నో విధాల మంచిదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు దగ్గు, జలుబు వంటి వాటిని తగ్గించడంలో తేనె అద్భుతంగా పనిచేస్తుందని స్పష్టం చేస్తున్నారు.

నేరేడు పళ్లు...
ఈ మధ్య కాలంలో చాలా మందికి నేరేడు పళ్లు అంటే తెలియడం లేదు. శరీరానికి సంబంధించి ఎంతో ముఖ్యమైన ప్రయోజనాలు ఇచ్చే పండ్లలో నేరేడు ఒకటి. అందుకే ఆయుర్వేదం దీన్ని అమృతాల్లో ఒకటిగా గుర్తించింది. రక్తంలో షుగర్ స్థాయులను తగ్గించే ఈ నేరేడు పళ్లు... మధుమేహం వ్యాధిగ్రస్తులకు అమృతం. ఇక చర్మం, నోటి సమస్యలను తగ్గించడంలోనూ ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

తులసి...
ఒక రకంగా తులసి నిజంగానే అమృతం. మన రోగ నిరోధక శక్తిని పెంపొందించడం నుంచి శ్వాస సమస్యల దాకా ఎన్నో సమస్యలను తగ్గించే సామర్థ్యం తులసి సొంతం. దీనిలోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు... మన సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతాయి.

అల్లం
మనం నిత్యం వంటల్లో ఉపయోగించే అల్లాన్ని తక్కువగా చేసి చూడవద్దు. జీర్ణ వ్యవస్థ పనితీరును పెంచడం, వికారాన్ని తగ్గించడం, కండరాల నొప్పులను తగ్గించడం, రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం, దగ్గు-జలుబులను తగ్గించడం సహా ఎన్నో ప్రయోజనాలను అల్లం నుంచి పొందుతాం. అందుకే ఆయుర్వేదం దీన్ని కూడా అమృతమైన వాటి జాబితాలో చేర్చింది.

  • Loading...

More Telugu News