Shobhitha: హైదరాబాదులో ఆత్మహత్యకు పాల్పడిన కన్నడ నటి శోభిత

Kannada actress Shobhitha commits suicide

  • గచ్చిబౌలిలోని నివాసంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య
  • గతేడాది పెళ్లి చేసుకున్న శోభిత
  • తెలుగులో పలు సీరియళ్లు, సినిమాల్లో నటించిన వైనం

కన్నడ నటి శోభిత హైదరాబాదులో బలవన్మరణానికి పాల్పడింది. శోభిత గచ్చిబౌలి శ్రీరామ్ నగర్ లోని తన నివాసంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శోభిత తెలుగులోనూ అనేక టీవీ సీరియళ్లలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. కన్నడ టాలీవుడ్ లోనూ పలు చిత్రాల్లో నటించిన ఆమె, మరిన్ని అవకాశాల కోసం హైదరాబాదులోనే స్థిరపడింది. ఆమె తెలుగులో నటించిన తొలి చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో. 

శోభిత 2023లో వివాహం చేసుకుంది. ఆమె భర్త పేరు సుధీర్. పెళ్లయిన ఏడాదికే ఆమె ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. పెళ్లయిన తర్వాత శోభిత సినిమాలకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. 

శోభిత స్వస్థలం కర్ణాటకలోని హాసన్ జిల్లా సకలేశపుర ప్రాంతం. హైదరాబాదులో పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని బెంగళూరు తరలించనున్నట్టు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News